సాక్షి ఎడిటర్ పై చంద్రబాబు కుట్రలను త్రిప్పికొడుతూ మంచిర్యాలలో జర్నలిస్టులు ఆందోళన

సాక్షి ఎడిటర్ పై చంద్రబాబు కుట్రలను త్రిప్పికొడుతూ మంచిర్యాలలో జర్నలిస్టులు ఆందోళన 

-- నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన 

--  టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు డేగ సత్యం,పింగిలి సంపత్ రెడ్డిలు ప్రసంగం...



మంచిర్యాల న్యూస్,అక్టోబరు-17,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించిన సాక్షి దినపత్రిక మీడియాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు ఐకమత్యంతో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.ఆ సందర్భంగా టియుడబ్ల్యూజే మంచిర్యాల జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు డేగ సత్యం,పింగళి సంపత్ రెడ్డిలు మాట్లాడుతూ..మద్యం వార్తలపై ఏపీ ప్రభుత్వం గత నాలుగు రోజులుగా సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి పలు మార్లు నోటీసులు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వ అరాచక పాలన,దమనకాండకు ఇదే నిదర్శనం అన్నారు.ఆ నేపథ్యంలోనే సాక్షి మీడియాపై ఏపీ ప్రభుత్వ కుట్ర సరైంది కాదని,మీడియా గొంతు నొక్కడం చూస్తుంటే పత్రిక స్వేచ్ఛపై దాడిగా పేర్కొన్నారు.ముఖ్యంగా సాక్షి ఎడిటర్ తో పాటు జర్నలిస్టులపై నమోదు చేసిన ఆ తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలని ప్రజా సంఘాలు,జర్నలిస్టులు డిమాండ్ చేశారు.ఆ నిరసన కార్యక్రమంలో సాక్షి మంచి జిల్లా బ్యూరో ఆకుల రాజు,జర్నలిస్టులు సురేష్ చౌదరి,శ్రీనివాస్,వంశీకృష్ణ,కాచం సతీష్,రవిరాజు,ఉదయ్,కలువల శ్రీనివాస్,దేవరాజ్,రాయలింగు,భూపతి రవి,నరేష్,పూరెళ్ళ లక్ష్మణ్,యెర్రం ప్రభాకర్,శ్రీధర్ ప్రజా సంఘాల నాయకులు దేవి పోచం,గుమ్ముల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి