తెలంగాణ బంద్..ఎక్కడికి అక్కడే నిలిచిపోయిన బస్సులు-మద్దతూ తెలిపిన ప్రజానీకం
జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,అక్టోబర్-18: తెలంగాణలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ కొనసాగుతుంది.ఆ క్రమంలో చూస్తే... ఉదయం 4 గంటల నుంచే బంద్ మొదలయింది.జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల బయట ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాలు అడ్డుకుంటున్నాయి.అటు ఈ బంద్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలిపాయి.బంద్‌కు ప్రజలు సహకరించాలని బీసీ నేతలు కోరుతున్నారు.రాష్ట్రంలో మెడికల్ షాపులు, అంబులెన్సులు,ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు వంటి అత్యవసర సేవలు మినహా సంపూర్ణంగా బందులో పాల్గొంటున్నారు. బీసీ జేఏసీ బంద్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
మంచిర్యాల జిల్లాలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది.చెన్నూర్,మందమర్రి,రామకృష్ణాపూర్ పట్టణంలో బీసీ బంద్ కు మంత్రి వివేక్ వెంకటస్వామి మద్దతూ తెలిపారు.అందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలన్నారు.42 శాతం రిజర్వేషన్ల తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని రాహుల్ గాంధీ కి క్రెడిట్ వస్తుందని కేంద్రం బీసీ రిజర్వేషన్లకు సహకరించడం లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు.
క్యాతనపల్లిల్లో కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను పరామర్శించిన కార్మిక శాఖ మంత్రి వివేక్
క్యాతనపల్లి మున్సిపాలిటీ కుర్మ పల్లిలో కాంగ్రెస్ నాయకులు బైర మల్లేష్ నానమ్మ ఇటీవల మరణించిన విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.16వ వార్డ్ కాంగ్రెస్ నాయకులు కట్ల రమేష్ మాతృమూర్తి ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.అనంతరం ఇటీవల అనారోగ్య పాలైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారేపల్లి రాజయ్య ఇంటికి వెళ్లి త్వరగా కోలుకోవాలని దైర్యం చెప్పి ఆర్ధిక సహాయం చేశారు. ఇటీవల యమహా శ్రీనివాస్ కు స్టంట్ వేయగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.మంత్రితో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,టిపిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథరెడ్డి,కాంగ్రెస్ నాయకులు గాండ్ల సమ్మయ్య,పుల్లూరి కళ్యాణ్,పలిగిరి కనకరాజు,ఎర్రబెల్లి రాజేష్,రామస్వామి,కనుక్కుట్ల కనకయ్య,రామ్ సాయి,సరేష్,వెంకట్ రెడ్డి, గోళ్ళ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద బీసీ బంద్
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్,రాజీవ్ చౌక్,బి జోన్ సెంటర్, శ్రీనివాస గార్డెన్ నుంచి క్యాతనపల్లి క్రాస్ రోడ్డు వరకు అమ్మ గార్డెన్,గద్దెరాగడి ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క షాపు వద్దకు వెళ్లి బీసీ రిజర్వేషన్స్కు మద్దతుగా బందును పాటించాలని షాప్స్ వారికీ విన్నవించారు.ఆ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ..బీసీ కులగననలో రాష్ట్రంలో 56 శాతం బీసీలు ఉన్నారని తేల్చి వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వము చేసిన అన్ని ప్రయత్నాలను కొంతమంది దుర్మార్గులు,బీసీ వ్యతిరేకులు కోర్టులలో కేసులు వేసి బీసీల హక్కులను కాలరాస్తూన్నారని, చట్టసభల్లో ఆమోదం పొందిన రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వము,గవర్నర్ కావాలనే ఆలస్యం చేసి బీసీల ఐక్యతను దెబ్బతీయాలని కుట్రపన్నారని ఆరోపించారు.క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ప్రజలందరూ స్వచ్ఛందంగా బీసీ బందుకు సంపూర్ణ మద్దతు తెలిపారు.ఆ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,కాంగ్రెస్ నాయకులు గాండ్ల సమ్మయ్య,పుల్లూరి కళ్యాణ్,నీలం శ్రీనివాస్ గౌడ్,మెట్ట సుధాకర్,గోపతి బానేష్,గోపు రాజo,కనకం వెంకటేశ్వర్లు,కుర్మ సురేందర్, పలిగిరి కనకరాజు, బత్తుల వేణు, బొద్దుల ప్రేంసాగర్,మేకల శ్రీను, బత్తుల శ్రీను,రామ్ సాయి,నాగేష్,నారాయణ, రాజన్న,హరిప్రసాద్,గోళ్ళ మల్లేష్, బీమా మల్లేష్,రామస్వామి, కనుక్కుట్ల కనకయ్య,పందిరి లింగయ్య, నేరెళ్ల చంద్రయ్య,కునారపు శివ, గుర్రం అనిల్,బింగి రమేష్ మరియు గద్దెరాగడి అమ్మాగార్డెన్ ప్రాంత ప్రజలు, కుల సంఘాల నాయకులు, వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర బీసీ బందులో ఈ రోజు సీపీఐ పార్టీ వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఆ సందర్భంగా సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోర్టు స్టేను రద్దు చేయాలని బీసీ రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చి స్తానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జనాభా ప్రాతిపదికన 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో అన్ని పార్టీలు బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చి గవర్నర్ కు పంపిన గవర్నర్ ఆమోదం తెలుపకపోవడం బీజేపీ కుట్ర అని అన్నారు.ఇప్పటికైన తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి బీసీ బిల్లు పార్లమెంటులో పెట్టి ఆమోదం తెలుపాలని డిమాండ్ చేశారు.ఆ కార్యక్రమంలో సీపీఐ పార్టీ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ రాష్ట్ర సమితి సభ్యులు ఇప్పకాయల లింగయ్య జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు కాదండీ సాంబయ్య పార్టీ నాయకులు మెతుకులు రాజు తోకల రాజన్న మారపెళ్లి రవి పోటర్ల రాములు కుక్క దేవానంద్ కారుకూరి రాయలింగు బత్తుల మొగిలి బోయపోతుల కొమురయ్య తదితరులు పాల్గోన్నారు.
Comments
Post a Comment