ఐఎంఏ మంచిర్యాల నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక-ప్రమాణ స్వీకారం

ఐఎంఏ మంచిర్యాల నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక-ప్రమాణ స్వీకారం

ముఖ్యఅతిథి టీజీఎంసీ మెంబర్-లీగల్ అండ్ ఎథికల్ కమిటీ డా.ఎగ్గన శ్రీనివాస్ హాజరు -ప్రసంగం...

మంచిర్యాల న్యూస్,అక్టోబరు-19,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లాలోని పాత మంచిర్యాలలో గల ఐఎంఏ బిల్డింగులో శనివారం ఐఎంఏ 2025-26 నూతన కార్యవర్గ కమిటీ యొక్క ప్రమాణస్వీకారం పెద్ద ఎత్తున నిర్వహించారు.ఆ కమిటీలో అధ్యక్షులుగా డాక్టర్ రావుల రవిప్రసాద్,ముఖ్య కార్యదర్శిగా డాక్టర్ అనిల్ ముత్తినేని,కోశాధికారిగా డాక్టర్ సంతోష్ చందూరి  ఎన్నుకోబడ్డారు.ఆ ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్(టీజీఎంసీ మెంబర్ లీగల్ అండ్ ఎథికల్ కమిటీ) హాజరయ్యారు.ఆ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు.కొత్త కార్యవర్గం డాక్టర్స్ సమస్యలను పరిష్కరించటంతో పాటు ప్రజారోగ్య సంరక్షణకు కృషి చేయాలని సూచించారు.అలాగే ప్రజలను ఆర్థికంగా ఆరోగ్యం పరంగా దెబ్బతీసున్న వాళ్ళపైన ఐఎంఏ నుంచి తగిన విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

-  వైద్య వ్యవస్థ ప్రక్షాళన దిశగా మంచిర్యాల డాక్టర్స్ మరో అడుగు....

ఆ ప్రమాణ స్వీకారం ప్రోగ్రాంలో ముఖ్య అతిధిగా హాజరైన డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్ మాట్లాడుతూ..కొత్త కార్యవర్గం ప్రజా ఆరోగ్యం మెరుగు పరుచుటకు,ప్రజలకు నాణ్యమైన వైద్యం అందే విధంగా కృషిచేస్తుందని ప్రకటించారు.ఆ నకిలీ డాక్టర్స్ నుంచి ప్రజలను కాపాడే పనిలో టీజీఎంసితో కలిసి పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు.అనంతరం కొత్త కార్యవర్గంతో డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేపించారు.ఆ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు డాక్టర్ విశ్వేశ్వర రావు,డాక్టర్ చంద్రదంత్, డాక్టర్ కెఎంఎన్ శ్రీనివాస్,డాక్టర్ సురేష్,డాక్టర్ సాల్మన్ రాజ్,డాక్టర్ సుఖ భోగి,డాక్టర్ జ్యోతిర్మయి,డాక్టర్ ప్రవీణ్ కుమార్,డాక్టర్ లక్ష్మీనారాయణ,డాక్టర్ స్వరూప రాణి,డాక్టర్ కీర్తి,డాక్టర్ కుమార్,డాక్టర్ జ్యోతి, డాక్టర్ రమణ,డాక్టర్ భరత్ వంశీ,డాక్టర్ బద్రి నారాయణ,డాక్టర్ మల్లేష్, డాక్టర్ ప్రసాద్ చౌదరి,డాక్టర్ శ్రీకాంత్ చీకోటి,డాక్టర్ అభిషేక్ చిద్దం,డాక్టర్ బిల్ల వికాస్,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి