అమర పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ఆర్కేపిలో క్యాండిల్ ర్యాలీ చేపట్టిన క్రీడాకారులు







అమర పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ఆర్కేపిలో క్యాండిల్ ర్యాలీ చేపట్టిన క్రీడాకారులు 

--  ముఖ్యఅతిథి ఎస్ఐ జి.రాజశేఖర్ 

రామకృష్ణాపూర్ న్యూస్,అక్టోబర్-21,జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్: ఉద్యోగరీత్యా పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో మంగళవారం రాత్రి స్థానిక క్రీడాకారుల ఆధ్వర్యంలో క్రోవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..పట్టణంలోని ఠాగూర్ స్టేడియం వద్ద ప్రారంభమైన ర్యాలీలో క్రీడాకారులు,పోలీసులు కొవ్వొత్తులు చేత పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్థానిక సూపర్ బజార్ చౌరస్తా వరకు ఆ ర్యాలీ చేపట్టారు.దాంతో పోలీస్ అమరవీరులను జ్ఞాపకం చేసుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఆ సమయంలో నినాదాలు చేస్తూ పోలీస్ అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఆ సందర్భంగా ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి,పట్టణ ఎస్ఐ జి.రాజశేఖర్,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు ప్రసంగించారు.ప్రజల రక్షణ కోసం పోలీసులు 24 గంటలు విధులు నిర్వహిస్తారని గుర్తు చేశారు.చైనా జరిపిన దాడిలో పోలీసులు మరణించిన దృష్ట్యా ఆనాటి నుంచి ప్రతి ఏడాది పోలీసు అమరవీరుల దినోత్సవంను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.ప్రజల రక్షణ కోసమే పోలీసులు ఉద్యోగరీత్యా విధులు నిర్వహిస్తారని తెలిపారు.ఆ కార్యక్రమంలో క్రీడాకారులు డిప్పు శ్రీనివాస్,కరాటే మాస్టర్ శ్రీనివాస్,దబ్బట శ్రీనివాస్,రంజిత్,ఇతర క్రీడాకారులు,పోలీసులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి