బిసి రిజర్వేషన్లలో కీలక పరిణామాలు-రిజర్వేషన్ చుట్టూ రాజకీయం

బిసి రిజర్వేషన్ల అంశంలో కీలక పరిణామాలు-రిజర్వేషన్ చుట్టూ రాజకీయం!

హైదరాబాద్ న్యూస్:అక్టోబర్- 7,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బీసీలకు 42% రిజర్వేషన్ ఇప్పుడు రోజుకు ఒక తలనొప్పిగా మారుతుంది.ఇప్పటికే స్థానిక సంస్థలపై అనేక డౌట్లు ఉన్నాయి.42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది.అటువైపు హైకోర్టులో మాధవరెడ్డి వేసిన పిటిషన్ పై రేపు మరోసారి విచారణ జరగనుంది. సోమవారం సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ పిటిషన్ ను కొట్టేసింది.బుధవారం హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందా?అనేది అందరికీ పెద్ద సస్పెన్స్. ఇలాంటి టైంలో బీసీల్లోను ఐక్యత కనిపించట్లేదు.ఎందుకంటే ఈ రిజర్వేషన్లు వచ్చినా కూడా బీసీలందరికీ న్యాయం జరగదని..కొన్ని కులాలకు మాత్రమే ఈ రిజర్వేషన్లతో లాభం జరుగుతుందని మిగతా కులాలు అంటున్నాయి.యాదవ,ముదిరాజ్,పద్మశాలి,గౌడ్స్,మున్నూరు కాపు లాంటి కొన్ని కులాలే ఇప్పటికీ రాజకీయాల్లో ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి.బీసీల నుంచి ఎక్కువమంది ఈ సామాజిక వర్గాలకు చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా కొనసాగుతున్నారు.దీంతో ఎంబీసీ కులాలు అయిన మిగతావాళ్లు మరో పిటిషన్ వేశారు.ఈ రిజర్వేషన్లు వచ్చినా సరే బీసీల్లోనూ ఆధిపత్యాన్ని చలాయిస్తున్న ఐదారు కులాలకే న్యాయం జరుగుతుంది తప్ప..తమదాకా సీట్లు రానివ్వరని వాళ్లు అంటున్నారు.కాబట్టి తమకు సపరేట్ గా ఈ 42% రిజర్వేషన్లలో కొన్ని సీట్లు కేటాయించేలా తీర్పు కావాలంటున్నారు.తమకు కూడా రాజకీయంగా ఎదిగే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు.ఎందుకంటే కనీసం వార్డు మెంబర్ కూడా కాని 136 బీసీ కులాలు ఉన్నా యంటే తమ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలంటున్నారు.ఆ నేపథ్యంలోనే బీసీల మధ్య మళ్లీ పోరు కనిపించేలా ఉంది.ఇప్పటికే కులాల మధ్య చాలా వివాదాలు నడుస్తున్నాయి.ఈ 42% రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాత మిగతా కులాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.రాజ్యాంగపరంగా ఇచ్చిన రిజర్వేషన్లకు మించి ఈ జీవో ఉందంటూ అటు కోర్టులు కూడా చెబుతున్నాయి.ఇలాంటి సమయంలో బీసీలకు న్యాయం చేయాలని తీసుకొచ్చిన ఈ జీవో..ఇప్పుడు అదే బీసీల మధ్య చిచ్చు రాజేసేలా కనిపిస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వెనుక ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి తీరాల్సిందే.ఏమాత్రం అటు ఇటు నిర్ణయాలు తీసుకున్నా కుల సంఘాల నుంచి నిరసనలు తప్పవని రాజకీయ నిపుణులు-

విశ్లేషకులు చెప్తున్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి