బ్రేకింగ్ న్యూస్..బిసి రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టులో వాదనలు ఇలా.._

బ్రేకింగ్ న్యూస్..

బిసి రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టులో వాదనలు ఇలా.._

హైదరాబాద్ న్యూస్,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,అక్టోబర్-8:స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ఆసక్తిగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.

వీటిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో వాదనలు ఆసక్తిగా జరుగుతున్నాయి. ప్రభుత్వం తరపున అడ్వకెట్ జనరల్, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ యాదవ్ హైకోర్టుకు స్వయంగా హాజరయి వాదనలు విన్నారు.

హైకోర్టు: రిజర్వేషన్ల పెంపు బిల్లు అసెంబ్లీలో ఎప్పుడు పాస్ అయ్యింది ?

అడ్వకేట్ జనరల్: 2025, ఆగస్ట్ 31వ తేదీన ఏకగ్రీవ తీర్మానం చేసి_ _గవర్నర్కు పంపటం జరిగింది.

హైకోర్టు: గవర్నర్ దగ్గర బీసీ_ _రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉందా..?

అడ్వకేట్ జనరల్: బీసీలకు 42 శాతం బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యింది.. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది.

పిటిషనర్ తరపు న్యాయవాది: బీసీ కోటా 42 శాతం ప్రభుత్వం పెంచి ఇచ్చింది (సుప్రీంకోర్టులో వాదనల అంశాన్ని ప్రస్తావించిన పిటిషనర్ తరపు లాయర్లు)

పిటిషనర్ తరపు న్యాయవాది: ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్ అమలు చేస్తోంది. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని రాజ్యాంగం చెబుతోంది. అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో కలిపి రిజర్వేషన్ 67 శాతానికి చేరుతుంది.

పిటిషనర్ తరపు న్యాయవాది: షెడ్యూల్ ఏరియాల్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు మాత్రమే రిజర్వేషన్లు పెంచుకునే అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించింది.

పిటిషనర్ తరపు న్యాయవాది: స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలన్న ఉద్దేశం లేదు.. చట్ట ప్రకారం రిజర్వేషన్లు ఉండాలన్నదే మా ఉద్దేశం.

అడ్వకేట్ జనరల్: కుల గణన ద్వారా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ పెంచటం జరిగింది. రాష్ట్రంలో బీసీల సంఖ్యకు తగ్గట్టు రిజర్వేషన్ పెంచటం జరిగింది.

అడ్వకేట్ జనరల్: స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ ద్వారా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం చేయటం సాధ్యం అవుతుంది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి