మంచిర్యాల జిల్లా ప్రజలకు ఒకే చోట అన్ని రకాల న్యాయ సేవలు
మంచిర్యాల జిల్లా ప్రజలకు ఒకే చోట అన్ని రకాల న్యాయ సేవలు
-- తేలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్
మంచిర్యాల న్యూస్, అక్టోబర్-11,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా ప్రజలకు ఒకే చోట అన్ని రకాల న్యాయస్థాన సేవలు అందించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు.ఆ క్రమంలో చూస్తే..శనివారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న న్యాయస్థానం భవన సముదాయ నిర్మాణ కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు.ఆ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ..మంచిర్యాల జిల్లా ప్రజలకు అన్ని రకాల న్యాయస్థాన సేవలు ఒకే చోట అందించేందుకు భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.అనంతరం జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి,మంచిర్యాల జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నగేష్ భీమపాక, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.వీరయ్య, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్, న్యాయవాదులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ చేశారు.ఆ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి,మంచిర్యాల అడ్మినిస్ట్రేటివ్ జడ్జి మాట్లాడుతూ..జిల్లా ప్రజలకు ఒకే చోట జిల్లా స్థాయిలో అన్ని రకాల న్యాయస్థానాల సేవలు అందించేందుకు 81 కోట్ల రూపాయల అంచనా విలువతో భవన నిర్మాణం పనులు ప్రారంభించడం జరిగిందని,కోర్టు భవనం శంకుస్థాపన ఇంట్లో పండగల జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. పోక్సో,ఫ్యామిలీ కోర్టులను కలుపుకొని 10+2 కోర్టులతో భవన సముదాయాన్ని నిర్మించడం జరుగుతుందని,2027 జూన్ మాసం నాటికి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.భారత న్యాయ నిర్మాణ వ్యవస్థ ద్వారా 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర బడ్జెట్ నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు.గోదావరి నదీ తీరాన కేంద్రీకృతమైన మంచిర్యాల జిల్లాలో వరి, పత్తి పంటలు పండుతున్నాయని, ఆధ్యాత్మికతకు నెలవైన మంచిర్యాల జిల్లాలో గూడెంలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి, గాంధారి ఖిల్లా వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు,శివ్వారం మొసళ్ళ అభయారణ్యం,సింగరేణి ఆధ్వర్యంలో బొగ్గు త్రవ్వకంతో పాటు విద్యుత్ ఉత్పాదకత కలిగి ఉందని తెలిపారు.ఎస్.సి., ఎస్.టి.కోర్టు, వినియోగదారుల ఫోరం ఏర్పాటుకు తగు ప్రతిపాదనలు పంపిస్తే త్వరితగతిన ఏర్పాటు చేసే విధంగా తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.20 నెలలలో నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా చూడాలని అధికారులకు సూచించారు.మితిమీరిన స్వార్థం,స్వార్థ మనస్తత్వ ధోరణి సమాజంలో అన్ని సమస్యలకు కారణమని,ప్రతి ఒక్కరూ ధర్మమార్గంలో తన పని చేసుకుంటూ వెళ్తే ఎలాంటి సమస్యలకు అవకాశం ఉండదని తెలిపారు శ్రమ ఆయుధమైతే విజయం బానిస అవుతుందని తెలిపారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..భవన నిర్మాణంతో కోర్టు సేవలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటాయని,భవన నిర్మాణ పనులను సంబంధిత గుత్తేదారు నిర్ణీత వ్యవధిలో, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని, తద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.అనంతరం వివిధ న్యాయ సంఘాల ప్రతినిధులు,న్యాయవాదుల ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తిని గౌరవంగా సన్మానిం
చారు.ఆ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment