7వ తేదీన వందేమాతర గేయం సామూహిక గీతాలాపన
7న వందేమాతర గేయం సామూహిక గీతాలాపన
మంచిర్యాల న్యూస్,నవంబరు-6,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :వందేమాతర గేయం రచించి దాదాపు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గురువారం మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)పి.చంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..బంకిం చంద్ర చటర్జీ వందేమాతర గేయ రచన చేసి సుమారు150 సంవత్సరాలు పూర్తయిందని దాంతో ప్రభుత్వ ఆదేశాలు మేరకు సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని,జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు,అన్ని ప్రభుత్వ/స్థానిక సంస్థల/ఎయిడెడ్/ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు.ఆ కార్యక్రమ సంబంధిత ఫోటోలు,వివరాలతో అదే రోజు సాయంత్రం ప్రభుత్వానికి సమర్పించాలని తెలిపారు.ఆ కార్యక్రమానికి అధికారులు,ఉద్యోగులు,ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Comments
Post a Comment