ఆ ఉపాధ్యాయుడు అడిచర్ల సాగర్ నైజం అదీ
మంచిర్యాల న్యూస్,నవంబరు-6,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :అదీ ఆ ఉపాధ్యాయుడు అడిచర్ల సాగర్ నైజం.ఆ క్రమంలో చూస్తే..ఎవరు బాధపడ్డా చలించిపోతాడు,బాధపడే గుండెకు అండగా నిలబడుతాడు.ఆ నేపథ్యంలోనే గురువారం మంచిర్యాల మైనారిటీ ఫంక్షన్ హాల్ యందు జిల్లా యువజన,క్రీడా శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా యువజన వారోత్సవ కార్యక్రమాలలో భాగంగా వివిధ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు.ఆ ఫోటోలో విద్యార్థిని ఆకుతోట వెన్నెల డ్రాయింగ్ పోటీలో పాల్గొంది.అయితే కనీసం మూడవ స్ధానంలోనైనా ఆ విద్యార్థిని నిలువలేకపోయానని బాధపడుతూ కనబడింది.ఆ కథల పోటీల నిర్వహణకు న్యాయ నిర్ఙేతగా వ్యవహరించినందుకు గాను తనకు అధికారులు ఇచ్చిన మెమెంటోను ఆ అమ్మాయికి ఇచ్చి ఆమెను సంతోషపరిచాడు ఒక ఉపాధ్యాయుడు.అతడే అడిచర్ల సాగర్ తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత.కాగా అడిచర్ల సాగర్ కు ఇది సహజమైన గుణం అని,ఇప్పటివరకు ఎంతో మందిని ఈ విధంగా ప్రోత్సాహించిన సందర్భాలు అనేకంగా ఉన్నాయని అక్కడ ఉన్న అతని మిత్రులు గుర్తు చేశారు.


Comments
Post a Comment