ఎయిమ్స్ హాస్పిటల్ లో యువకునికి అరుదైన శస్త్రచికిత్స

డాక్టర్ యేగ్గేన శ్రీనివాస్

ఎయిమ్స్ హాస్పిటల్ లో యువకునికి అరుదైన శస్త్రచికిత్స

  మంచిర్యాల న్యూస్,నవంబరు-7,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల పట్టణంలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో హాజీ అనే యువకునికి అరుదైన చికిత్స చేసి రికార్డు నెలకొల్పారు.ఆ క్రమంలో చూస్తే..పూర్తి వివరాల్లోకి వెళితే..జిల్లాలోని గర్మిళ్లకు చెందిన మహమ్మద్ హాజీ 25 అనే సంవత్సరాలు గల యువకునికి సంవత్సరం క్రితం యాక్సిడెంట్ కావడంతో మంచిర్యాలలోనీ వివిధ హాస్పిటల్లో ఆ యువకునికి చికిత్స చేశారు.దాంతో అతని కాలు ఎముక ఇన్ఫెక్షన్ కావడంతో ఆ కాలు ఎముక కాస్తా అతుక్కుపోవడంతో హైదరాబాద్ తో పాటు కరీంనగర్ ఇంకా ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లి చికిత్స కోసం తిరిగినాడు.అటు తర్వాత మంచిర్యాలలోని ఎయిమ్స్ హాస్పిటల్ యొక్క డాక్టర్ యెగ్గన శ్రీనివాస్ ను సంబంధిత యువకుడు సంప్రదించాడు.ఆ నేపద్యంలో వెంటనే డాక్టర్ యోగ్గేన శ్రీనివాస్ ఆ రోగి పట్ల స్పందించారు.అయితే వైద్య చికిత్సలు నిమిత్తం పరీక్షించిన డాక్టర్ శ్రీనివాస్ యెగ్గన ఇల్లిజారో అనే పద్ధతిలో రింగ్స్ సర్జరీ చేసారు.దాంతో ఆ వైద్య చికిత్స ను విజయవంతం చేసారు.ఆ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎయిమ్స్ ఆసుపత్రిలో అందిస్తున్న మెరుగైన మంచి వైద్య చికిత్సలు గురించి తెలిపారు.ముఖ్యంగా అంబులెన్స్ డ్రైవర్లు,నకిలీ వైద్యుల పట్ల ప్రజలు చాలావరకు అప్రమత్తంగా ఉండాలనీ సూచించారు.అంతేకాకుండా ప్రజలు వైద్య చికిత్సల కోసం క్వాలిఫైడ్,ప్రొఫెషనల్ హాస్పిటల్స్ కి లేదా గవర్నమెంట్ హాస్పిటల్ కు మాత్రమే వెళ్లాలని తెలిపారు.కొంతమంది అంబులెన్స్ వాళ్ళు,నకిలీ వైద్యులు గాని ఇన్సూరెన్స్ ఏజెంట్లు గాని కమిషన్లు కొరకు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ విషయాలను కూడా అందరూ మంచిగా గమనించి అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రకటించారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి