తెలంగాణలో చలి-పులి పంజా భయం

తెలంగాణలో చలి-పులి పంజా స్టార్ట్...



-- ఉష్ణోగ్రతలు పడిపోయాయి

-- జాగ్రత్తగా ఉండాలి 

-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక స్పెషల్ న్యూస్.....

మంచిర్యాల న్యూస్,నవంబరు-9,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చలి పులి పంజా మొదలైంది.ఆ క్రమంలో చూస్తే..రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురిసాయి.తాజాగా వాటికి బ్రేక్ పడటంతో ఇప్పుడు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.రాష్ట్రంపై చలి పంజా విసరడం ప్రారంభించింది.శనివారం నుంచే రాష్ట్రంలో చలి ప్రారంభం మొదలుపెట్టింది.నవంబర్ 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఆ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.శనివారం రాత్రి నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా బేలలో 14.7 డిగ్రీల సెల్సియస్,రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 14.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.జహీరాబాద్‌లో 14.7 డిగ్రీల సెల్సియస్, శంకర్ పల్లి 14.9 డిగ్రీల సెల్సియస్,మొయినాబాద్ 15.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇక హైదరాబాద్‌లో రాజేంద్రనగర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లలో అత్యల్పంగా 15.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.బీహెచ్‌ఈఎల్ 15.5 డిగ్రీల సెల్సియస్ మల్కాజ్‌గిరి 15.7, గచ్చిబౌలి 15.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను నమోదు అయినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.ముఖ్యంగా అసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.ఈ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని మిగిలిన 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ఈ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

- ప్రజలు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలు...

రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,చలి నుంచి తమను తాము కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.ఈ చలిని తట్టుకునేందుకు స్వెటర్లు,జాకెట్లు,మఫ్లర్‌లు ధరించాలి.శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే విధంగా దుస్తులు ధరించడం ఉత్తమం అంటున్నారు.శరీరంలో వేడిని ఉత్పత్తి చేసేందుకు వేడి వేడి సూప్‌లు,గోరువెచ్చని నీరు,ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.వృద్ధులు,చిన్నపిల్లలు అత్యవసరమైతే తప్ప ఉదయం త్వరగా,రాత్రి పొద్దుపోయిన తర్వాత బయటకు వెళ్లడం మానుకోవాలి.ఈ చలి వల్ల చర్మం పగలడం,పొడిబారడం జరగకుండా నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి