పల్లెల్లో ప్రశాంతంగా పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు
పల్లెల్లో ప్రశాంతంగా పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు సాగుతున్నాయి
హైదరాబాద్ న్యూస్,డిసెంబర్:11,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల్లో గ్రామ సర్పంచ్,వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి,ఆ క్రమంలో చూస్తే..తెలంగాణలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.మొత్తం 4,236 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరగాల్సి ఉండగా,395 గ్రామాల్లో ఇప్పటికే సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఐదు గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.ఆ నేపథ్యంలోనే 3,834 గ్రామపంచాయతీలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతోంది.12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు,వార్డు సభ్యుల పదవుల కోసం 65,455 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఈ సర్పంచ్ స్థానాలకు సగటున 3.38 మంది,వార్డు స్థానాలకు సగటున 2.36 మంది పోటీ పడుతున్నారు.కాగా మధ్యాహ్నం 2 గంటల తరువాత ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.అనంతరం ఫలితాలు సాయంత్రం ప్రకటిస్తారు.అంతేగాక ఉపసర్పంచ్‌ను సైతం ఈరోజు సాయంత్రమే ఎన్నుకొనున్నారు.

Comments
Post a Comment