బొక్కలగుట్ట సర్పంచ్ ప్రచారంలో మాసు శ్రీనివాస్ ముందంజ
బొక్కలగుట్ట సర్పంచ్ ప్రచారంలో మాసు శ్రీనివాస్ అభ్యర్థి ముందంజ
-- సర్పంచ్ పోటీలో ఆ నలుగురు అభ్యర్థులు హోరాహోరీ పోటీ
-- కాంగ్రెస్ అభ్యర్థి మాసు శ్రీనివాస్ ఫుట్బాల్ గుర్తు విజయం వైపు
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్-ఎన్నికల సర్వే ప్రత్యేక కథనం...
రామకృష్ణాపూర్ న్యూస్,డిసెంబరు-11,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బొక్కల గుట్ట గ్రామపంచాయతీ ఎన్నికలు ఈ నేల-17న జరుగుతున్నాయి.ఆ క్రమంలో చూస్తే..బొక్కలగుట్ట సర్పంచ్ పోటీ బరిలో ఆ నలుగురు అభ్యర్థులు ఉన్నారు.దాంట్లో చూస్తే..కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాసు శ్రీనివాస్ ఫుట్బాల్ గుర్తుతో ఆయన పోటీ చేస్తున్నారు.అలాగే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గజ్జి గోపాల్,ఇండిపెండెంట్ అభ్యర్థిగా గజ్జి మల్లయ్య,బిజెపి అభ్యర్థిగా గోశిక ప్రశాంత్ పోటీ చేస్తున్నారు.ముఖ్యంగా ఆ గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం ఎనిమిది వార్డులు ఉన్నాయి.దాంట్లో చూస్తే..1292 మంది ఓటర్లు ఉన్నారు.అయితే ప్రధానంగా ఎస్సీ జనరల్ గా ప్రభుత్వం ఈ దఫా అక్కడికి గ్రామపంచాయతీకి రిజర్వేషన్ కల్పించింది.దాంతో బొక్కలగుట్ట సర్పంచ్ గా పోటీ చేస్తున్న సంబంధిత అభ్యర్థులు పోటీ బరిలో ఉన్నారు.ఆ నేపద్యంలోనే అక్కడి గ్రామపంచాయతీలోనీ రెండు,మూడు,నాలుగు,ఆరు అనే వార్డులలోని వార్డు సభ్యులను ఆ నలుగురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అదేవిధంగా ఒకటవ వార్డు సంధినేని మల్లేష్ అయిదవ వార్డు సామల నాగజ్యోతి,ఏడవ వార్డు అభ్యర్థి మోర్కనేపల్లి మానస,ఎనిమిదో వార్డు అభ్యర్థిని బొలిశెట్టి మంగ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే వాళ్ల యొక్క వార్డులలో ఎన్నికల పోటీలలో విజయ డంక మోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఆ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే బొక్కల గుట్ట గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలు ఓట్లు వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Comments
Post a Comment