తెలంగాణలో ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికలకు కసరత్తు?
తెలంగాణలో ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికలు జనవరిలోనే...
జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్..
హైదరాబాదు న్యూస్,డిసెంబర్-17,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసాయి.ఆ తరుణంలో ఎంపీటీసీ-జడ్పిటిసి ఎలక్షన్ చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఆ క్రమంలో చూస్తే..ఆ విషయమై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.తాజాగా సంబంధిత ఫైల్ ను అధికారులు సిఎంకు పంపారు.ఆ నేపథ్యంలోనే రెండు విడతల్లో ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు.దాంతో పంచాయతీ తరహాలోనే రిజర్వేషన్లు ఖరారు చేశారు.అయితే సిఎం ఆమోదిస్తే ఈ నెల 25లోపు షెడ్యూల్ విడుదల అవుతుంది.అలాగే వచ్చే నూతన సంవత్సరం జనవరిలో ఎన్నికలు పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు సమాచారం గుండా తెలిసింది.

Comments
Post a Comment