పెద్దపులి సంచారం అబద్ధం-శివాలయం అడవిలో మాత్రమే పులి





పెద్దపులి సంచారం ఒక ఫేక్-శివాలయం అడవిలో మాత్రమే పులి ఉంది

జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ స్పెషల్ న్యూస్...

మంచిర్యాల న్యూస్,డిసెంబర్-18,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లాలో గల శ్రీరాంపూర్ ఏరియాలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో అసలు వాస్తవం లేదని మంచిర్యాల డిఎఫ్ఓ-శివ్ ఆశీస్ సింగ్,మంచిరాల ఎఫ్ఆర్ఓ-జి.రత్నాకర్ రావు అనే ఫారెస్ట్ జిల్లా,రేంజ్ అధికారులు తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..జిల్లాలోని సీసీసీ ప్రాంతానికి చెందిన సూరం సాయికిరణ్ అనే యువకుడు అతని తండ్రి మద్యం సేవించి అసలు ఇంటికి రావట్లేదని అతని తండ్రి ఇంటికి రావడానికి మాత్రమే ఒక పులి తిరుగుతున్నట్లు ఫేక్ న్యూస్ క్రియేట్ చేసినట్లు తెలిపారు.దాంతో అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఆ నేపథ్యంలోనే జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ లోని ఆర్కే-5 శివాలయం అటవీ ప్రాంతం ఏరియాలో మాత్రం పెద్దపులి తిరుగుతున్నట్లు తమకు ఆనవాళ్లు లభించినట్లు ఫారెస్ట్ సిబ్బంది గుర్తించినట్లు పేర్కొన్నారు.ఆ పులి సంచారం విషయమై సింగరేణి జిఎంల దృష్టి కూడా తీసుకు వెళ్లినట్లు సింగరేణి ఉద్యోగులు,అక్కడి ప్రాంతానికి చెందిన ప్రజలు ఎవరు కూడా భయపడనవసరం లేదని జాగ్రత్తలు తీసుకోవాలని ఆ పులి కావాలని ఎవరి జోలికి రాదని తెలిపారు.ఆ పులి విషయమై దానికోసం టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి