పులిమడుగు సర్పంచ్ గా ఎన్నికల బరిలో ఆ ఇద్దరూ




పులిమడుగు సర్పంచ్ గా ఎన్నికల బరిలో ఆ ఇద్దరూ

-- బుక్య బుజ్జి,నందిని అభ్యర్థినిలు పోటీ

-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్..

రామకృష్ణాపూర్ న్యూస్,డిసెంబరు-11,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పులిమడుగు గ్రామపంచాయతీ ఎన్నికలు ఈనేల-17న ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మేరకు రాష్ట్ర ప్రభుత్వం సూచనలతో మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి-కలెక్టర్ సంబంధిత అధికారులు పకడ్బందీగా చేపడుతున్నారు.ఆ గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం ఎనిమిది వార్డులు ఉన్నాయి.ఆ పంచాయతీ పరిధిలో మొత్తంగా ఓటర్ల సంఖ్య-1260 ఉన్నారు.ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న భూఖ్య బుజ్జి భర్త మోహన్ గురువారం జర్నలిస్టు న్యూస్ పేపర్-టీవీ ఛానల్ తో మాట్లాడారు.గతంలో కూడా వాళ్ళ యొక్క కుటుంబం సభ్యులు కాబడిన బుఖ్య దేవి,బుక్యా సక్రియలు ఆ గ్రామ సర్పంచిలుగా ఉన్నట్లు పేర్కొన్నారు.దాంతో అక్కడి గ్రామంలో రోడ్లు,డ్రైనేజీ,బోర్ వెల్స్ ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు.ఆ గ్రామ ప్రజలు ఓటు వేసి గెలిపించాలని ఇంకా మరింత ఎక్కువగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.ఆ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కూడా వాళ్ల యొక్క అభిప్రాయాలు తెలిపారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి