చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై పోలీసు కేసు నమోదు

రామకృష్ణపూర్ న్యూస్,ఫిబ్రవరి-17,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ పై దేవాపూర్ ఎస్ హెచ్ ఓ గంగారాం ఫీర్యాదు చేశారు.ఆ క్రమంలో చూస్తే..క్యాతన పల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పురస్కరించుకుని పోలీసుల యొక్క బందోబస్తు విధులకు ఆటంకం కలిగించడం,కోటపల్లి ఎస్సై రాజశేఖర్,కానిస్టేబుల్ రాకేష్ లకు గాయాలు చేసినట్లు ఆ దాడికి పాల్పడిన బాల్క సుమన్,మూల రాజిరెడ్డి,గుడిసెల రాజా రమేష్,గాజుల చంద్ర కిరణ్,మేడిపల్లి సంపత్,గోగుల రవీందర్ రెడ్డిలపై చట్టరీత్యా అండర్ సెక్షన్ 189(3),191(2),191(3),121(2),223 r/w 190 BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.



Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ