పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండాలి-ప్రచారం చేయరాదు,బెల్లంపల్లి ఏసిపి
క్యాతనపల్లిలో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండాలి -ఎన్నికల ప్రచారం చేయరాదు
బెల్లంపల్లి ఏసిపి ఏ.రవికుమార్
జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్....
రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-9,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు ఈ నేల-11న జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ గా పోటీ చేసే అభ్యర్థులు వాళ్ల యొక్క సన్నిహితులు ఇతరులు ఎవరైన కూడా పోలింగ్ బూతులకు దూరంగా ఉండాలని బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంను మందమర్రి సిఐ పి.రమేష్,సిఐ రమేష్ బాబు,ఆర్కేపి ఎస్ఐ జే.శ్రీధర్,ఎస్సైలుతో కలిసి నిర్వహించారు.ఆ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ..ఎన్నికల నియమ,నిబంధనలు అందరూ క్రమశిక్షణతో తప్పకుండా పాటించాలని సూచించారు.ఎన్నికల సంఘం ఆదేశాలను యొక్క నిబంధనలు బేకతారు చేసిన లేదా ఉల్లంఘించిన వ్యక్తుల మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments
Post a Comment