ఎన్నికల ప్రచారం ముగిసింది-క్యాతనపల్లి అభ్యర్థులలో ఉత్కంఠ ఎక్కువైంది?

ఎన్నికల ప్రచారం ముగిసింది-క్యాతనపల్లి అభ్యర్థులలో ఉత్కంఠ ఎక్కువైంది
జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్

రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-9,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి 9 సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో పోటీ చేస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ,బిఆర్ఎస్-సీపీఐ పొత్తుల పార్టీ,స్వతంత్రగా పోటీ చేసే అభ్యర్థుల మధ్య తీవ్రమైన ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.గత కొన్ని రోజులుగా హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ఎన్నికల సంఘం ఆదేశానుసారం ముగుస్తుంది.దాంతో ఇప్పటివరకు ప్రచార జోరులో హోరెత్తిన సంబంధిత రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థుల గుండెల్లో టెన్షన్ మొదలైంది.ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇప్పటినుంచి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ రోజు సమయం వరకు మరో ఎత్తుగా రాజకీయ ఎత్తుగడలతో తీవ్రమైన ఆలోచనలతో గెలుపే ధ్యేయంగా ఇంకా అన్ని రకాలుగా ఓటర్లను దగ్గరగా మచ్చిగా చేసుకోవడానికి పోటీ చేస్తున్న కొంతమంది అభ్యర్థులు అనేక కోణాలలో విశ్వ ప్రయత్నాలు చేయడమే కాకుండా అనేక రకాలుగా హామీలు ఇవ్వడం గాక డబ్బుల వర్షం కురిపించడానికి కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారని చెప్పడంలో అసలు సందేహం లేదు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ