గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్టు
గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్టు
ఐదు మొక్కలు స్వాధీనం
తెలంగాణ జర్నలిస్టు న్యూస్...
సుల్తానాబాద్ న్యూస్ ఏప్రిల్ 4 జర్నలిస్టు దినపత్రిక-మీడియా న్యూస్ పెద్దపల్లి జిల్లా బ్యూరో: పెద్దపల్లి జిల్లాసుల్తానాబాద్ మండలం ఆరేపల్లి గ్రామ శివారులో గల సాయిరాం బ్రిక్స్‌లో ఒక వ్యక్తి గంజాయి మొక్కలు పెంచుతున్నాడనే సమాచారం మేరకు ఈరోజు సుల్తానాబాద్ ఎస్ఐ తన సిబ్బందితో పాటు మండల వ్యవసాయ అధికారి పైడితల్లితో కలిసి సాయిరాం బ్రిక్స్‌లో తనిఖీ నిర్వహించారు.ఆ తనిఖీల సమయంలో అక్కడ గంజాయి మొక్కలు పెంచుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.ఒడిశా రాష్ట్రానికి చెందిన సుకల్పరబోయి అనే వ్యక్తి గత ఐదు నెలల క్రితం సాయిరాం బ్రిక్స్‌లో పనిచేయడానికి వచ్చాడు.గంజాయి సేవించే అలవాటు ఉండడంతో తన వెంట తెచ్చుకున్న గంజాయి గింజలను నాటి మొక్కలను పెంచుతున్నట్లు తెలిసింది.ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఐదు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసిన ఐదు మొక్కల విలువ సుమారు రూ.50,000 వరకు ఉంటుందని అంచనా.

Comments
Post a Comment