రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ “దోచుకో-దాచుకో” పథకం ప్రారంభించింది-కేటీఆర్

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ “దోచుకో-దాచుకో” అనే పథకం ప్రారంభించింది 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

అందుకే ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారు 

కాంగ్రెస్ పార్టీ అంతా అవినీతిమయం 

రేవంత్ రెడ్డి అంతా భారీ అవినీతిపరుడు దేశంలో ఇంకొకరు లేరు 

బీజేపీ-కాంగ్రెస్ తోడు దొంగల మాదిరి కలిసి నడుస్తున్నాయి 

అందుకే సింగరేణి నుంచి మొదలుకొని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతిపైన విచారణ లేదు 

ప్రధానమంత్రి ఆర్ఆర్ టాక్స్ , హోంమంత్రి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అని చెప్పినా ఇప్పటిదాకా ఒక ఎంక్వయిరీ లేదు 

అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపి కలిసి ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నాయి 

సింగరేణి కార్మికుల కోసం కొట్లాడుతాం 

కార్మికుల సమస్యలు పట్టించుకోకుంటే…సింగరేణిలో అవినీతి ఆపకుంటే…ప్రతి బొగ్గు గనిమీద అగ్గిపుట్టిస్తాం….

తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక.....

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాతన పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను సన్మాంచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.ఆ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి 'దాచుకో-దోచుకో' అన్న పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా నడిపిస్తున్నారు. అవినీతి దుకాణం తెరిచి అడ్డగోలుగా వసూళ్లకు దిగుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి పథకంలో స్వయంగా మంత్రుల నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అవినీతికి పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన  'దాచుకో-దోచుకో-దాచుకో' పథకం సింగరేణిలోనూ నడుస్తోంది.

రేవంత్ రెడ్డి అంత చండాలపు ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరూ లేరు. రేవంత్ రెడ్డి అంత దారుణంగా, భారీ ఎత్తున దోచుకుంటున్న ముఖ్యమంత్రి కూడా దేశంలో ఇంకా ఎవరూ లేరు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి అంటే, తెలంగాణ రైతుల ముఖంలో చిరునవ్వులు రావాలి అంటే, సింగరేణి కార్మికులకు లాభం జరగాలి అంటే కేసీఆర్ తిరిగి రావాల్సిందే. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే కేసీఆర్ తిరిగి రావాల్సిందే.

కాంగ్రెస్ పార్టీతో బిజేపి కూడా వంత పాడుతూ సింగరేణి కుంభకోణాన్ని అడ్డుకోవడం లేదు. వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నా 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం కనీసం ఉలుకూ పలుకూ లేకుండా మౌనంగా ఉన్నది. వేల కోట్ల దోపిడీ పైన సీబీఐ ఎంక్వైరీ వేయమంటే పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్, బిజేపి చీకటి దోస్తులుగా మారి ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి బావమరిది సింగరేణిలో టెండర్లు వేస్తుంటే ఇక్కడే వసూళ్లు అవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ పథకంలో కూడా సృజన్ రెడ్డికి వందల కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చింది. అందుకే రాష్ట్రంలో ఇచ్చిపుచ్చుకునే విధంగా బిజేపి, కాంగ్రెస్ లు కలిసి నడుస్తున్నాయి. అందుకోసమే ఒకరి దోపిడీ ఒకరు బయటపడకుండా బ్రహ్మాండంగా కాంగ్రెస్, బిజేపి పార్టీలు పరస్పరం కాపాడుకుంటున్నాయి.

ప్రధానమంత్రి ఢిల్లీకెంచి వచ్చి రాష్ట్రంలో 'ఆర్‌ఆర్' (RR) టాక్స్ వసూలు చేస్తున్నారు, బిల్డర్ల దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర దోపిడీ చేస్తున్నారు అని విమర్శించారు. కానీ రాహుల్-రేవంత్ టాక్స్ పైన ఇప్పటిదాకా విచారణకు ప్రధానమంత్రి ఎందుకు ఆదేశించలేదు? హోం మంత్రి అమిత్ షా వచ్చి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటిఎంగా మారింది, అడ్డగోలుగా కుంభకోణాలు చేస్తుంది అన్నారు. కానీ దొంగలను పట్టుకోవాల్సిన కేంద్ర హోంశాఖ మంత్రి ఒక్క విచారణకు కూడా ఆదేశం ఇవ్వలేదు. అందుకే కాంగ్రెస్, బిజేపిలు ఒకరి దొంగతనం బయటపడకుండా ఇంకొకరు కాపాడుకుంటూ వస్తున్నారు.

ఎన్ని ప్రలోభాలకు, ఎన్ని అక్రమ కేసులకు, వేధింపులకు గురి చేసినా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ప్రజలకి, మా పార్టీ కౌన్సిలర్లకి, కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పొత్తు ధర్మాన్ని పాటించి మాతో నడిచిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ కౌన్సిలర్లకు, జిల్లా నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.

రాష్ట్రంలో నీచమైన, నికృష్టమైన రాజకీయం కొనసాగుతున్నది. క్యాతనపల్లిలో 22 స్థానాలకు 14 స్థానాలు గెలిస్తే కూడా కాంగ్రెస్ పార్టీ అనేక అరాచకాలకు పాల్పడింది. క్యాతనపల్లిలో ప్రజలు తిరస్కరించిన మంత్రి వివేక్ అహం దెబ్బతినడంతో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపించేలా క్యాతనపల్లిలో సైనిక కవాతు నిర్వహించి మరి కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేశారు. 1000 మంది పోలీసులతో మాజీ ఎమ్మెల్యే సుమన్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారిని ఇబ్బందులకు గురి చేశారు.

ఎన్ని కేసులు పెట్టినా, దౌర్జన్యాలు చేసినా, రాళ్లు వేసినా, కౌన్సిలర్లను ఎత్తుకుపోయే ప్రయత్నం చేసినా చివరికి లక్షల రూపాయల బ్లాంక్ చెక్కులు రాసిచ్చినా కాంగ్రెస్ పార్టీ ముఖాన కొట్టిన మన కౌన్సిలర్లందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే సుమన్ క్యాతనపల్లిలో ఉంటే తమ ఆటలు సాగవని అక్రమంగా అరెస్ట్ చేసి ఆసిఫాబాద్, మంచిర్యాల సబ్ జైలు కాకుండా అదిలాబాద్ జిల్లా జైల్లో పెట్టారు. కనీసం మాజీ ఎమ్మెల్యే అన్న గౌరవం ఇయ్యకుండా తీవ్ర ఇబ్బందులకు జైల్లో గురి చేశారు.

మంత్రి వివేక్ క్యాతనపల్లి కావాలని సుమన్ ని అడుక్కుని ఉంటే ఇచ్చేసేవాడు. కానీ జైలుకు పంపి ఇబ్బందులకు గురి చేశాడు. నేను జైలులో సుమన్ని కలిసేందుకు పోతే, 'నేను ఇక్కడ సంవత్సరం అయినా ఉంటా కానీ మన కౌన్సిలర్లకు ధైర్యం చెప్పండి' అన్నాడు. 'కాంగ్రెస్ ఆటలను అరికట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజా తీర్పుని గౌరవించేలా కార్యకర్తలకు పోరాటం చేసేందుకు ధైర్యం నింపండి' అని కోరిండు.

క్యాతనపల్లిలో జరిగిన నికృష్టమైన రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కొనసాగిస్తున్నది. సింగరేణి ప్రాంతం మొత్తాన్ని ముఖ్యమంత్రి తన సొంత ఇంటి సామ్రాజ్యం మాదిరిగా తయారు చేశారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు,ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు దాటినా ఒక్క హామీ అమలు చేయలేదు. రైతుల నుంచి ఆడబిడ్డల దాకా, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అందరికీ తీవ్రమైన మోసానికి కాంగ్రెస్ పార్టీ గురి చేసింది. 'మూడు నెలల్లో పిల్లలు పుడతారా' అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, 30 నెలలు అయింది ఎందుకు గ్యారెంటీలు అమలు చేయలేదో అని మనం అడగాలి.

కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి 'దాచుకో-దోచుకో' అన్న పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా నడిపిస్తున్నారు. అవినీతి దుకాణం తెరిచి అడ్డగోలుగా వసూళ్లకు దిగుతున్నారు. సింగరేణిలోనూ 'దాచుకో-దోచుకో-దాచుకో' పథకం నడుస్తోంది. అందుకే ముఖ్యమంత్రి సొంత బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో అన్ని కాంట్రాక్టులు ముఖ్యమంత్రి నడిపిస్తున్నాడు.దేశంలో ఎక్కడా లేని విధంగా 'సైట్ విజిటేషన్ సర్టిఫికేట్' అనే కొత్త కుట్రను తెరలేపిండు. సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ తో టెండర్లు వేసిన వాళ్ళని బ్లాక్ మెయిల్ కి గురి చేసి బెదిరింపులకు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు దిగుతున్నారు.

సింగరేణిలో సృజన్ రెడ్డి అరాచకాలను బయట పెడితే ముఖ్యమంత్రి ఇప్పటిదాకా ఆ వేల కోట్ల కుంభకోణం పై మాట్లాడలేదు. సింగరేణి కుంభకోణం పైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడరు, స్థానిక మంత్రి కూడా మాట్లాడడు. పైగా గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 16 వేల వారసత్వ ఉద్యోగాల పైన విచారణ జరిపిస్తామని సింగరేణి ఉద్యోగులను భయపెడుతున్నారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాల పైన ఏసీబీ విజిలెన్స్ విచారణ కాదు జరిపించాల్సింది, సృజన్ రెడ్డి అక్రమాల పైన సింగరేణి కుంభకోణం పైన.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి ఉద్యోగాలు వెంటనే కల్పించాలి. లేకుంటే బిఆర్ఎస్ తరపున సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము. సింగరేణి కార్మికుల కోసం ప్రతి బొగ్గు గనిలో మళ్ళీ అగ్గి పుట్టిస్తాం, కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టం. సింగరేణికి అనేక సమస్యలు ఉన్నాయి. అయితే సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మమ్మల్ని పోరాటం చేయమని అడుగుతున్నారు. 

కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన ఒత్తిడి తీసుకురావాలి, కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేయాలి. సింగరేణి కార్మికులకు అండగా మా పార్టీ నిలబడుతుంది, సింగరేణి కార్మికుల తరపున బరాబర్ కొట్లాడుతాం. మాతో కలిసి రండి, రానున్న సింగరేణి ఎన్నికల్లో మళ్ళీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని గెలిపించుకుందాం.

"అభయహస్తం మేనిఫెస్టో పేరుట తెలంగాణ ప్రజలపై భస్మాసుర హస్తాన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టింది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతుబంధుకు రామ్ రామ్ అయితది, దళితబంధుకు జై భీమ్ అయితది, తెలంగాణ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ అమ్ముకదోప్తారు అని కేసీఆర్ చెప్పారు. ఆయన చెప్పినట్లే ఇప్పుడు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ దోచుకుంటుంది.

ఆయన ఇంకో రెండున్నర సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అరాచకాలను భరించాల్సిందే. కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీని గల్లా పట్టి, నిలదీసి కొట్లాడాలి. సింగరేణి బెల్టులో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను నిలదీయండి, గట్టిగా అడగండి. సింగరేణి సమస్యల పైన, వారసత్వ ఉద్యోగాల పైన కొట్లాడాలి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రతి బొగ్గుగని పైన, ప్రతి డివిజన్లో సమస్యల పైన మేము మాట్లాడతాం, కార్మికులకు అండగా నిలబడతాం.

కాళేశ్వరం కూలేశ్వరం అన్న సన్నాసి ముఖ్యమంత్రి, కాళేశ్వరం ప్రాజెక్టు లేనిదే ఇంత భారీగా ధాన్యం ఎలా పండిందో చెప్పాలి. కేసీఆర్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు లేకుండా దేశంలో అగ్రస్థానంలో ధాన్యం ఉత్పత్తిలో నిలబడిన తెలంగాణ ప్రస్థానం గురించి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ రాకముందు ఎండిపోయిన బోర్ల పైన ఆధారపడ్డ రైతుల బాధలను కేటీఆర్ గుర్తు చేశారు. ఎండిన బోర్లు, కరెంటు కోతలను దాటుకొని సస్యశ్యామలంగా ఉన్నది తెలంగాణ అంటే కేసీఆర్ ప్రాజెక్టులు కారణం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

గోదావరి నది పైన కొత్తగా నిర్మాణాలు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రతో ఏమన్నా ఒప్పందం జరిగిందా? ఎన్ని మీటర్లకు అంగీకారం కుదిరిందో చెప్పాలి. బడ్జెట్లో 52 కోట్లు పెట్టి బరాజ్‌లు కడతామంటే ఎలా సాధ్యమవుతుంది? సంవత్సరానికి 52 కోట్ల బడ్జెట్ తో ఎన్ని వందల సంవత్సరాలు ఈ బరాజ్‌లు కడతారో కాంగ్రెస్ చెప్పాలి. 'ఇగో కడతాం అగో కడతాం' అనే బిల్డప్పు తప్ప సాగునీటి ప్రాజెక్టుల అతీగతీ లేదు.

అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రవ్యాప్తంగా తిరస్కరించవలసిన అవసరం ఉన్నది. క్యాతనపల్లిలో ఏ ప్రజాస్వామిక స్ఫూర్తితో అయితే పార్టీ శ్రేణులు, ప్రజలు కొట్లాడారో, అదేవిధంగా ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పైన కొట్లాడాలి. జిల్లా పరిషత్ ఎన్నికలైనా, సింగరేణి ఎన్నికలైనా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నిలబడాలి. 

ఈ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష. మళ్ళీ త్వరలోనే తెలంగాణకు మంచి రోజులు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందనీ ధీమా వ్యక్తం చేశారు.


.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ