Posts

Showing posts from January, 2025

300 కోట్ల కుంభకోణంలో శ్రీలక్ష్మి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్ జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్

300 కోట్ల కుంభకోణంలో శ్రీలక్ష్మి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్ జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ జనవరి 31 హైదరాబాద్ న్యూస్ దుండిగల్: గత ఏడేళ్లుగా జి ఎల్ సి విల్లా ప్రాజెక్టులో మోసపూరిత వ్యవహారాలకు పాల్పడి 400 కోట్ల కుంభకోణం చేసిన ఎన్ఆర్ఐ గుర్రం విజయలక్ష్మిని గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. అలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే హెచ్ఎండిఏ, మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు అనుమతులు మంజూరు చేసే సమయంలో అవినీతి లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. బాధితులకు అన్యాయం జరుగకుండా ప్రమాదకర నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అధికారులపై కూడా విచారణ జరపాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.కేవలం అరెస్ట్ కాదు, సహకరించిన అధికారులపై చర్యలు తప్పనిసరి గుర్రం విజయలక్ష్మికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పదవి నుండి తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.అవినీతి నిరోధక శాఖ (తెలంగాణ ఏసీబీ) చిన్న ఉద్యోగులపై కాకుండా అలాంటి భారీ మోసాలకు సహకరించిన అధికారులపై దృష్టి సారించాలన...

గంజాయి రవాణాలో ప్రెస్ స్టిక్కర్ పేరుతో ఇద్దరు జర్నలిస్టులు

Image
గంజాయి రవాణాలో ప్రెస్ స్టిక్కర్ పేరుతో ఇద్దరు జర్నలిస్టులు జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ జనవరి 31 భద్రాచలం న్యూస్ : గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులు సహా ముగ్గురు వ్యక్తులను నార్కోటిక్ విభాగపు పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.ఆ క్రమంలో చూస్తే...భద్రాచలం పట్టణంలోని గోదావరి నది బ్రిడ్జి చెక్ పోస్టు వద్ద నార్కోటిక్ పోలీసులకు చిక్కిన ఆ ఇద్దరు విలేకరుల గంజాయి దందా ఘటన కలకలానికి దారి తీసింది.ఆ నేపథ్యంలోనే నార్కోటిక్ అధికారులు భద్రాచలం బ్రడ్జి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఆ ఇద్దరు విలేకరులు ‘ప్రెస్’ స్టిక్కర్ గల కారులో గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడ్డారు.ఆ ఇద్దరు కూడా బూర్గంపాడు మండలంలో విలేకరులుగా చెలామణిలో ఉన్నారు.ఆ ఇద్దరు విలేకరుల్లో ఒకరు ప్రెస్ క్లబ్ లో కీలక బాధ్యతల్లో ఉన్నట్లు సమాచారం.ఆ నిందితుల నుంచి రూ. 20.25 లక్షల విలువైన 81.950 కిలోల ఎండు గంజాయిని నార్కొటిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.వారితోకలిసి గంజాయి రవాణా చేస్తున్న ఛత్తీస్ గఢ్ లోని కుంట తాలూకా మర్లగూడకు చెందిన మరో వ్యక్తిని కూడా నార్కోటిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని భద్రాచలం టౌన్ పో...

రూ.300 కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ యాజమాని విజయలక్ష్మి అరెస్ట్

 రూ.300 కోట్ల రూపాయల  మోసానికి పాల్పడిన శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ యాజమాని విజయలక్ష్మి అరెస్ట్  ---  దేశం విడిచిపారిపోయేందుకు ప్రయత్నం --  శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు* ---  విల్లాల పేరుతో భారీ మోసానికి తెరతీసిన నిందితురాలు జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ జనవరి 31 హైదరాబాద్ న్యూస్: ఏకంగా రూ.300 కోట్ల మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించిన శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ యాజమాని గుర్రం విజయలక్ష్మి (48)ని శంషాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆ క్రమంలో చూస్తే..నిజాంపేటకు చెందిన విజయలక్ష్మి శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్,శ్రీలక్ష్మి మాగ్స్ కన్‌స్ట్రక్షన్స్ అండ్ భావన జీఎల్‌సీ క్రిబ్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది.2018లో మల్లంపేటలో 325 విల్లాల నిర్మాణం ప్రారంభించింది.వాటిలో 65 విల్లాలకు మాత్రమే అనుమతులున్నాయి.మిగిలిన వాటికి పంచాయతీ అనుమతులు చూపించి మొత్తం 260 విల్లాలు విక్రయించింది. అయితే,ఈ విల్లాలు అక్రమమని ఫిర్యాదు రావడంతో విచారణ అనంతరం 2021లో 201 విల్లాలను అధికారులు సీజ్ చేశారు. అయినప్పటికీ ఆ...

ఆర్కేపిలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

Image
  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ జనవరి 30 రామకృష్ణ పూర్ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఠాగూర్ స్టేడియం ముందు గల  మహాత్మా గాంధీ విగ్రహానికి చెన్నూరు అసెంబ్లీ ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా  పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుడు జాతిపిత మహాత్మా గాంధీ యొక్క గొప్పతనం గురించి క్లుప్తంగా అభివర్ణించారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆర్కేపీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు పిసిసి సెక్రెటరీ రఘునాథ్ రెడ్డి సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ గాండ్ల సమ్మయ్య గోపతి రాజయ్య కళ్యాణ్, క్యాతనపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌన్సిలర్లు యువ నాయకులు కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ మహాత్మునికి నివాళులు

Image
---ఎమ్మెల్యే వివేక్ తో కలిసి గాంధీ విగ్రహానికి  పూలమాలలు వేసిన జర్నలిస్టులు  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ జనవరి 30 రామకృష్ణ పూర్ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఠాగూర్ స్టేడియం ముందు గల  మహాత్మా గాంధీ విగ్రహానికి క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి తో కలిసి గురువారం చేపట్టిన సంబంధిత కార్యక్రమంలో క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కలువల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ కమిటీ ట్రెజరర్ పరికిపండ్ల రాజు వైస్ ప్రెసిడెంట్ తూముల భవిష్యత్ లు మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ  నాయకులు ప్రెస్ అండ్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

లక్ష డప్పులు వేయి గొంతులు సభను విజయవంతం చేయాలి --- ఆర్కేపీ ఎంఆర్పిఎస్ ప్రకటన

Image
జర్నలిస్టు ప్రెస్ అండ్ మీడియా న్యూస్,జనవరి 29, రామకృష్ణాపూర్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వచ్చే నెల 7న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే లక్ష డప్పులు అనే బహిరంగ సభకు దళిత ప్రజానీకం అందరు కూడా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు.ఈ క్రమంలో చూస్తే..రామకృష్ణాపూర్ లోని తిలక్ నగర్ లో బుధవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు సరేష్ మాట్లాడారు. ఏబిసిడి వర్గీకరణలో భాగంగానే రాజధానిలో నిర్వహించే బహిరంగ సభకు పట్టణంలోని అన్ని దళిత వర్గ ప్రజానీకం అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.ముఖ్యంగా ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఆ సభ భారీ ఎత్తున చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే దళితనులందరూ కూడా డప్పులు చేత పట్టుకొని ఆ సభకు అత్యంత ఉత్సాహంతో తరలిరావాలని దానికి పట్టణ ఎమ్మార్పీఎస్ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సరేష్,ఆరు ముళ్ళ పోచం,కళ్యాణ్,కలువల శ్రీనివాస్,రాజయ్య,చందర్,శంకర్,మాదిగ సోదరీ,స...

100వ రాకెట్ ప్రయోగం విజయవంతం

Image
 శ్రీహరికోట: జనవరి 29  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన అంతరిక్ష ప్రయోగాలలో మరో చరిత్రను సృష్టించింది. ఈరోజు తెల్లవా రుజామున 6:20 గంటలకు శ్రీహరికోట లోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి 100వ ప్రయోగాన్ని విజయవం తంగా పూర్తి చేసింది.  ఈప్రయోగంలోజీఎస్ఎల్వీ-ఎఫ్15 (GSLV-F15)రాకెట్ ద్వారా నూతన నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-02 (NVS-02) ను కక్ష్యలో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్వీఎస్-02 ఉపగ్రహం భారతీయ ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ (నావిక్) విస్తరణలో కీలక పాత్ర పోషించనుంది.  దీని మొత్తం బరువు 2,250 కిలోలు ఉండగా.. 10 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. ఉపగ్రహం జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశించడంతో భారత నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఇస్రో ఛైర్మన్‌గా నారాయ ణన్‌కు ఇదే తొలి ప్రయోగం కాగా, ఇది విజయవంతం కావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తూ ఈ ప్రయోగం ఇస్రో విజయ యాత్రలో మరో గొప్ప ఘట్టమని తెలిపారు.  శ్రీహరికోట నుంచి ఇస్రో మొదటి రాకెట్ 1979 ఆగస్టు 10న నింగిలోకి ప్రయాణించగా, దాదాపు 46 ఏళ్ల తర్వాత 100వ ప్రయో...

రోజూ పాల‌ను అస‌లు ఏ సమ‌యంలో తాగాలి..?

Image
     పాల‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే దాదాపు అన్ని పోష‌కాలు ఉంటాయి. ఒక్క విట‌మిన్ సి త‌ప్ప పాల‌లో అన్ని పోష‌కాలు ఉంటాయి. అందుక‌నే పాల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. ఈ క్ర‌మంలోనే రోజూ ఒక గ్లాస్ పాల‌ను తాగితే శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నింటినీ పొంద‌వ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. పాల‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పాల‌ను తాగితే అందులో ఉండ క్యాల్షియం మ‌న ఎముక‌లు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. పాల ద్వారా మ‌న‌కు స‌హ‌జ‌సిద్ధంగా క్యాల్షియం ల‌భిస్తుంది. ఇక ప్ర‌స్తుతం చాలా మంది విట‌మిన్ డి లోపం బారిన ప‌డుతున్నారు. అలాంటి వారు రోజూ పాల‌ను తాగితే ఈ విట‌మిన్ స‌మృద్ధిగా ల‌భిస్తుంది. దీంతో ఎముక‌లు ఆరోగ్యంగా ఉండ‌డ‌మే కాదు, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి సైతం పెరుగుతుంది. ఎముక‌ల దృఢ‌త్వానికి.. పాల‌లో ఉండే ఫాస్ఫ‌ర‌స్ ఎముక‌లు బ‌లంగా మారేందుకు ఎంత‌గానో స‌హాయ ప‌డుతుంది. కొవ్వు తీసిన పాల‌ను సేవించ‌డం వ‌ల్ల గుండె పోటు, టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అలాగే పాల‌ను...