ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...తిమ్మాపూర్ లో ఎన్ హెచ్-63 అధికారులను అడ్డుకున్న భూ నిర్వాసితులు

ఫ్లాష్...ఫ్లాష్ న్యూస్.... 

తిమ్మాపూర్ లో ఎన్ హెచ్-63 అధికారులను అడ్డుకున్న భూ నిర్వాసితులు 






జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్....

రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 11 జర్నలిస్టు తెలుగు దినపత్రిక :  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల తొమ్మిదో వార్డులోని తిమ్మాపూర్ లో సర్వేకి వచ్చిన ఎన్ హెచ్- 63 అధికారులను మంగళవారం అక్కడి భూ నిర్వాసితులు రోడ్డు వేయవద్దని తీవ్రవాదోపవాదాల మధ్యన బేషరతుగా అడ్డుకున్నారు.ఆ సందర్భంగా దాదాపు 50 నుంచి 60 మంది అక్కడి బాధితులు సంబంధిత అధికారులతో ఈరోజు మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్ విలువ కాకుండా గజానికి పదివేల చొప్పున కచ్చితంగా ఇస్తేనే..ఇటువైపుగా రోడ్డు నిర్మాణం చేయాలని లేకపోతే ఆ రోడ్డు అసలు ఆ ప్రాంతం నుంచి నిర్మాణం చేయవద్దని డిమాండ్ చేశారు.ప్రధానంగా లక్షలు పెట్టి కొనుగోలు చేసిన వాళ్ల యొక్క సొంత భూములు-స్థలం హైవో రోడ్డుకు ఇవ్వాలంటే అక్కడి భూ నిర్వాసితులకు తప్పకుండా వాళ్లకు సంబంధించిన డిమాండ్ ప్రకారమే నష్టపరిహారం చెల్లించాలని కోరారు.అనంతరం అక్కడి సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు.ఆ సందర్భంగా ఎన్ హెచ్ 63 అధికారులు భూనిర్వాసితులు మాట్లాడడం జరిగింది.


Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి