గాంధారి జిల్లా మైసమ్మ జాతరను పరిశీలించిన మంచిర్యాల డిసిపి భాస్కర్





 

--- 14,15,16 తేదీల్లో జరిగే ఆ జాతర ఏర్పాట్లు పరిశీలించారు 

--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్..

రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 3 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బొక్కలగుట్ట గ్రామపంచాయతీ లోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర ఈనెల 14,15 ,16 తేదీల్లో నిర్వహిస్తారు.ఆ నేపద్యంలోనే అక్కడి మైసమ్మ జాతర ప్రాంతాన్ని అక్కడి పనులను సోమవారం మంచిర్యాల్ జిల్లా డిసిపి ఏ.భాస్కర్,బెల్లంపల్లి సబ్ డివిజన్ ఏసిపి రవికుమార్,మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై రాజశేఖర్ లు పరిశీలించారు. ముఖ్యంగా జాతరల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రధాన రోడ్లు, పార్కింగ్ ఏరియాలు,చెక్ పోస్ట్లు పాయింట్లు పర్యవేక్షించారు.ఆ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర జరిగే సమయాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా ముఖ్యమైన విషయాలపై అన్ని కోణాలలో వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి