ఆర్కేపిలో భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు
ఆర్కేపిలో భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు..
-- రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి ఆర్.లక్ష్మణ్,పట్టణ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ప్రసంగం
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చెన్నూరు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సిపిఐ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ-99 వసంతాలు పూర్తిచేసుకోని 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆ పార్టీ యొక్క నియోజకవర్గ జనరల్ బాడీ మీటింగ్ ను ఈరోజు చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్,సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లు హాజరైనారు.ఈ సందర్భంగా ఆ పార్టీ
నాయకులు సిపిఐ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఆర్కేపీ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్,నాయకులు ఏం.పౌలు,సిపిఐ పార్టీ నాయకులు,మహిళా నాయకురాలు,పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment