గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరలో పకడ్బందీగా పోలీసు బందోబస్తు

గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరలో పకడ్బందీగా పోలీసు బందోబస్తు 






-  బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ 

- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్....

రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 14 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర యొక్క బందోబస్త్ కు వచ్చిన సిబ్బందికి శుక్రవారం బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ఉద్యోగరీత్యా వాళ్లకు సంబంధించిన సూచనలు చేశారు.ఆ సందర్బంగా ఏసిపి రవికుమార్ మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం భక్తులు గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లినీ దర్శనం కోసం వివిధ గ్రామాల నుంచి అధికసంఖ్యలో విచ్చేసి పూజలు చేసి మొక్కులు చెల్లించడం అనవాయితీగా ఉంటుందని తెలిపారు.కాగా మూడు రోజులు అంటే 14-2-2025 నుంచి 16-2-2025 వరకు ఈ జాతర జరుగుతుందని జాతర చివరి రోజున గుట్ట కింద ప్రజా దర్బార్ కూడ చేపడుతున్నట్లు వివరించారు.ఈ జాతర కోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున పెద్దసంఖ్యలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామని,జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించి నిర్దేశించిన ఏరియాలో మాత్రమే వాళ్లకు సంబంధించిన వాహనాలను నిలపాలని,దుకాణాలు పెట్టు కునేవారు పోలీసులు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే ఆ దుకాణాలు పెట్టుకోవాలన్నారు.దాంతో జాతర విజయవంతం అయ్యేలా చూడాలని కోరారు.గుట్ట మీద అమ్మవారి దర్శనం చేసుకునే భక్తులు తప్పకుండా "క్యూ" లైన్ లో మాత్రమే  వెళ్లాలని,దర్శనం కోసం గుట్టపైకి వెళ్లే భక్తులు జాగ్రత్తగా నడవాలని,గుట్ట కింద గల చెరువు వద్దకు వెళ్ళు భక్తులు జాగ్రత్తగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో ఆ చెరువులో దిగే ప్రయత్నం చేసి అసలు ప్రమాదలకు గురి కావొద్దని పేర్కొన్నారు.ఆ జాతరలో ప్రజలు, భక్తులు పోలీసులకు సహకరించి,ప్రశాంతంగా మైసమ్మ తల్ల దర్శనం చేసుకోవాలనీ తెలిపారు.ఆ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ తో పాటు మందమర్రి సీఐ శశిదర్ రెడ్డి,బెల్లంపల్లి సీఐ ఆఫ్జాలోద్దీన్,తాండూర్ సీఐ కుమారస్వామి,రామకృష్ణాపూర్ ఏస్.ఐ రాజశేఖర్,సబ్-డివిజన్ ఏస్ఐలు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి