భరోసా ద్వారానే బాధిత మహిళలకు మంచిగా రక్షణ

భరోసా ద్వారానే బాధిత మహిళలకు రక్షణ...




---   భరోసా సెంటర్ వార్షికోత్సవంతో బాధితులకు సహాయం

---   మంచిర్యాల డిసిపి భాస్కర్ ప్రసంగం.. 

---   జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...

జర్నలిస్టు తెలుగు దిన పత్రిక ఫిబ్రవరి 6 : రామగుండం పోలీస్ కమీషనరేట్ లోని మంచిర్యాల జోన్ పరిధిలో బాధిత మహిళలు లేదా బాలికలకు వైద్యం,కౌన్సిలింగ్, అన్ని రకాల సేవలు అందించడంతో పాటు వారికి పోలీస్ అండగా ఉందనే మనోదైర్యం కల్పించడం కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ప్రారంభించి సంవత్సరకాలం అయ్యింది.ఆ నేపథ్యంలోనే వార్షికోత్సవ కార్యక్రమం గురువారం నిర్వహించారు.ఆ కార్యక్రమనికి మంచిర్యాల డిసిపి భాస్కర్ - ఐపిఎస్ హాజరైనారు.ఆ భరోసా సిబ్బంది తో కలసి కేక్ కట్ చేసి అనంతరం బాధితులతో మాట్లాడినారు. దాంతో మంచి భరోసా కల్పించి వారికి సహాయం చేసారు.ఆ సందర్బంగా డిసిపి మాట్లాడుతూ..భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు,బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.కాగా భరోసా కేంద్రాలు దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు.భరోసా సహాయ కేంద్రాలు సమగ్రమైన సహాయాన్ని అందించడానికి, ఆపదకు లోనైన వారికి పోలీస్ స్టేషన్లకు,ఆసుపత్రులకు దూరంగా సురక్షితమైన వాతావరణంలో చేయూత అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయని గుర్తు చేశారు. ప్రధానంగా హింస లైంగిక వేధింపులకు గురైన పిల్లలు,స్త్రీలు మరల అటువంటి వాటి బారిన పడకుండా చూడటమే భరోసా సెంటర్ యొక్క ముఖ్యలక్ష్యంగా ప్రకటించారు.లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు లేదా బాలికలకు సంబందించిన కేసు పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన సమయం నుంచి బాధితులకు అండగా ఉంటూ వారి మానసిక పరిస్థితి గురించి తెలుసుకుంటూ వారికి మంచిగా భరోసా కల్పిస్తూ ఆ భరోసా సెంటర్ల గురించి అందరికీ అవగాహన కల్పిస్తున్న భరోసా సెంటర్ సిబ్బందిని డిసిపి అభినందించారు.ఆ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్,మంచిర్యాల రూరల్ సీఐ అశోక్,మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, సీసీసీ నస్పూర్ ఎస్ఐ సుగునాకర్ మంచిర్యాల టౌన్ ఎస్ఐ వినీత,మంచిర్యాల జిల్లా షి టీమ్ ఎస్ఐ హైమ,షి టీమ్ సిబ్బంది,భరోసా సెంటర్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి