అంబేద్కర్ జయంతితో ఆర్కేపిలో పంచశీల జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వివేక్

అంబేద్కర్ జయంతితో ఆర్కేపిలో పంచశీల జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వివేక్ 





-- అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు

--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్...

రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్ 14 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల అంబేద్కర్ అంగడి బజార్లో గల పంచశీల పతాకంను సోమవారం చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు.ఆ క్రమంలో చూస్తే.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరైనారు.దానికి ముందుగా అంబేద్కర్ విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి అటు పిమ్మట పంచశీల పథకాన్ని ఆవిష్కరించారు.అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల దండలు సమర్పించి నమస్కారములు తెలిపారు.తదానంతరం అక్కడ కేక్ కట్ చేసి అంబేద్కర్ యువజన సంఘం నాయకులకు స్థానికులకు ఆ కేకును తినిపించారు.ఆ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడారు. అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని అందరూ కలిసిమెలిసి ఉండాలని తెలిపారు.భారత రాజ్యాంగంను రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని గుర్తు చేశారు.ప్రజల కోసం ఎన్నో హక్కులు కల్పించిన ఘనత కూడా ఆయనకే దక్కినట్లు కొనియాడారు.అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ రావడానికి కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని హక్కులు మూల కారణమని గుర్తు చేశారు.అంబేద్కర్ ప్రజల ఆశయ సాధనలకు అనుకూలంగా ఉండే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా గొప్ప మేధావిగా ఆయన ప్రపంచంలోనే మొదటి స్థాయిలో నిలిచినట్లు వివరించారు.ఆ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బైరిమల్ల మొగిలయ్య,ఎట్టెం లచ్చన్న,ఆగయ్య,చందర్,పోశం,రామిళ్ళ మల్లేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె రాజు,అబ్దుల్ అజీజ్,గాండ్ల సమ్మయ్య,మాజీ కౌన్సిలర్లు,దళిత సంఘం నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు,అన్ని రాజకీయ పార్టీల నాయకులు,స్థానికులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి