యేసుప్రభు తిరిగి లేచాడని రామకృష్ణాపూర్ లో క్రైస్తవులు రన్ ఫర్ జీసస్

యేసుప్రభు తిరిగి లేచాడని రామకృష్ణాపూర్ లో క్రైస్తవులు రన్ ఫర్ జీసస్ 

--  ఉదయం ఏడు గంటలకే పరుగులు తీస్తూ యేసుప్రభు లేచాడని ప్రచారం...

--  యేసుక్రీస్తు యొక్క దైవ సేవకులు ప్రసంగం..

--   జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా టీవీ న్యూస్...
























రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్-19 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్.. పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువు పున:రుత్తానుడై తిరిగి లేచాడని చాటి చెబుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో అన్ని క్రైస్తవ సంఘాల క్రైస్తవులు శనివారం పెద్ద ఎత్తున రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..ఆర్కేపి పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద ప్రారంభమైన సంబంధిత రన్ ఫర్ జీసస్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ సూపర్ బజార్ చౌరస్తా సింగరేణి పాత క్వాటర్స్ ఇంకా శ్రీ కోదండ రామాలయం మీదుగా స్థానిక అమరవీరుల స్తూపం నుంచి యూనియన్ బ్యాంకు ముందుగా ఉన్న సిఎస్ఐ చర్చి వరకు ఈ రన్ కొనసాగింది.కాగా ముందుగా పట్టణంలోని రాజీవ్ చౌకువద్ద సిఎస్ఐ చర్చి పాస్టర్ రెవరెండ్ ఎం.జాషువా పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువుకు ప్రార్థనలు చేసి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.దాంతో పట్టణంలోని పురవీధుల గుండా రన్ ఫర్ జీసస్ యాత్ర కొనసాగింది.ఈ రన్ ఫర్ జీసస్  కార్యక్రమంలో సీఎస్ఐ చర్చి ఫాస్టర్ రెవరెండ్ ఎం.జాషువా,చర్చి కమిటీ సెక్రటరీ డోలకల డేవిడ్,చర్చి ఫాస్ట్రేట్ స్టూవర్టు కే.దేవానందం,జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ చైర్మన్ కలువల శ్రీనివాస్,వివిధ క్రైస్తవ సంఘాలకు చెందిన పాస్టర్లు జాషువా,సామెల్,ప్రభుదాస్,మార్కు రమేష్, సీఎస్ఐ చర్చి ఫాస్ట్రేట్ కమిటీ సభ్యులు,మాజీ కమిటీ సభ్యులు,   పట్టణంలోని 27 క్రైస్తవ సంఘాలకు చెందిన క్రైస్తవులు,పాస్టర్లు,మహిళలు యువకులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి