ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుడు ఆత్మహత్య - ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-3, జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బి-జూన్ లోని శ్రీనివాస నగర్(క్యాతనపల్లి మున్సిపాలిటీ 17వార్డు)కు చెందిన కుషనపెల్లి నవీన్(33)అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న గోర విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది.ఆ క్రమంలో చూస్తే..పట్టణంలోని ఒక ప్రైవేటు స్కూల్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా మృతుడు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.కాగా ఆ మృతునికి భార్య ఇద్దరు కుమారులు తండ్రి ఉన్నారు.ఆ మేరకు స్థానిక ఎస్సై రాజశేఖర్ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఫ్రెండ్స్ కు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని ఆత్మహత్యకు ముందు రెండు పేజీల లేఖ కూడా ఆ మృతి చెందిన యువకుడు వ్రాసినవి అక్కడ స్థలంలో లభ్యమయ్యాయి.నవీన్ ఆత్మహత్యకు గల అసలు కారణాలు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆర్కేపి లో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్... జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-25,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ ప్రధాన రహదారి పై బుధవారం రాత్రి అర్థగంట క్రితం ట్రాక్టర్ ఢీకొనడంతో మందమర్రి కి చెందిన పి.మల్లేశ్వరి(38) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.ఆ క్రమంలో చూస్తే...బైకుపై ఇద్దరు వస్తుండగా ఎదురుగా ఒక ట్రాక్టర్ కూడా రావడంతో అదే సమయంలో 2 ఎద్దులు పోట్లాడుతూ బైక్ మీదకు రావడంతో బైక్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఎడమవైపు ఆ బైకుపై కూర్చున్న మహిళ కుడివైపు పడడంతో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఆమె తల మీద వెళ్ళింది.దాంతో ఆమె తల పగిలి మెదడు బయటికి వచ్చి తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది.ప్రధానంగా చూస్తే..ట్రాక్టర్ డ్రైవర్ స్పీడ్ తో డ్రైవింగ్ చేయడం అలాగే ఎద్దులు కూడా బైకు మీదకు రావడం చేత అవి పోట్లాడుకోవడం చేత బైకుకు ఎదురుంగా అడ్డంగా రావడంతోనే ఆ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.ఆ విషయం తెలిసిన వెంటనే రామకృష్ణాపూర్ స...
ఓటుకు పెద్ద నోటులు ఇస్తున్నారని నిలదీసిన స్వతంత్ర అభ్యర్థిని జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-11,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఏరియా హాస్పిటల్ రోడ్డులో గల సెయింట్ జోసఫ్ స్కూల్ యొక్క పోలింగ్ బూత్ 21లో ఆ వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని స్వర్ణలతకు చెందిన ఐదుగురు అనుచరులు ఓటుకు పెద్ద నోట్లు ఇస్తుండడంతో అదే వార్డుకు చెందిన స్వతంత్ర అభ్యర్థిని దోమల సౌజన్య ఆమె భర్త తిరుపతి వాళ్లకు సంబంధించిన వ్యక్తులు పట్టుకొని నిలదీశారు. ఆ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిని మాట్లాడుతూ..ఆమె గెలుపును చూసి ఓర్వలేకనే ఆ విధంగా చేస్తున్నారని దానిపై ఆమెకు న్యాయం చేయాలని అధికారులను ఆమె డిమాండ్ చేశారు.ఆ విషయమై బిఆర్ఎస్ పార్టీ నాయకులను అవార్డుకు సంబంధించిన పార్టీ శ్రేణులను జర్నలిస్టు టీవీ ఛానల్ ప్రశ్నించగా అది పుకారు మాత్రమే అని కొట్టి పరేశారు.
Comments
Post a Comment