క్యాతనపల్లిలో-113 మంది అభ్యర్థులు పోటి-80 మంది విత్ డ్రా..
క్యాతనపల్లి మున్సిపల్ లో113 మంది అభ్యర్థులు పోటి-80 మంది విత్ డ్రా అయ్యారు
రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-3,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: ఈనెల-11న జరిగే మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో దాదాపు 113 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.ఆ క్రమంలో చూస్తే..మంగళవారం మున్సిపాలిటీ ఆఫీసులో జరిగిన విత్ డ్రా ప్రోగ్రాంలో 80 మంది పోటీ చేసే అభ్యర్థులు విత్ డ్రా అయ్యారు.ముఖ్యంగా చూస్తే... ఈ ఎన్నికల పోటీలలో మొత్తంగా 193 అభ్యర్థుల నుంచి నామినేషన్లు వచ్చాయి.దాంతో 22 వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు అన్ని ఈ క్రింద చూపెట్టిన విధంగా ఉన్నాయి.దాంట్లో చూస్తే...కాంగ్రెస్ పార్టీ 22 అభ్యర్థులు,బిఆర్ఎస్ సిపిఐ పొత్తుతో కలిపి బిఆర్ఎస్ 15 మంది అభ్యర్థులు సిపిఐ 7 గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.అలాగే బిజెపి 22 అభ్యర్థులు,జనసేన పార్టీ నలుగురు,ఏఐఎఫ్బి నలుగురు,సిపిఎం ఇద్దరూ,బి.ఎస్.పి ఇద్దరు,ఇండిపెండెంట్ లు 35 మంది మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల పోటీ బరిలో ఉన్నారు.అయితే బిఆర్ఎస్ పార్టీ కాబడిన గండమల్ల కృపానందం(గ్యాస్ నాని)అనే అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకువచ్చి విత్ డ్రా చేయించే ప్రయత్నం చేశారని ఆఫీసు ఆవరణలో సిపిఐ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల మధ్య కొంత రసభసాగా మారింది.ప్రధానంగా పట్టణ ఎస్ఐ జే.శ్రీధర్ ఇరు పార్టీల శ్రేణులను శాంతింప చేశారు.దాంతో గ్యాస్ నాని విత్ డ్రా కాలేదని తాను విత్ డ్రా చేయలేదని తెలిపారు.మరిన్ని వివారాలతో ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తూన్నా జర్నలిస్టు టీవీ ఛానల్,న్యూస్ పేపర్ అండ్ వెబ్ న్యూస్ 24 గంటలు న్యూస్ ను తప్పకుండా చూడగలరు.

Comments
Post a Comment