క్యాతనపల్లి-14వ వార్డులో ఇంటింటా ప్రచారం-కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ కుమార్
14వ వార్డులో ఇంటింటి ప్రచారం...
రామకృష్ణాపూర్ న్యూస్,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ ఫిబ్రవరి 5: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగుల రాజ్ కుమార్ ఇంటింటికి ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించారు.గురువారం వార్డులోని పోచమ్మబస్తీ, మల్లిఖార్జున్ నగర్‌లో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.ఆ సందర్బంగా నాగుల రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నిలలో ఆయనకు ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వాళ్ల యొక్క వార్డును అభివృద్ది చేసి చూపిస్తాన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం,కార్మిక శాఖ మంత్రి వివేక్ వల్ల చెన్నూర్ నియోజక వర్గంలో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతుందన్నారు.మున్సిపల్ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మేజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,వార్డు ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment