ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుడు ఆత్మహత్య - ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-3, జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బి-జూన్ లోని శ్రీనివాస నగర్(క్యాతనపల్లి మున్సిపాలిటీ 17వార్డు)కు చెందిన కుషనపెల్లి నవీన్(33)అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న గోర విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది.ఆ క్రమంలో చూస్తే..పట్టణంలోని ఒక ప్రైవేటు స్కూల్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా మృతుడు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.కాగా ఆ మృతునికి భార్య ఇద్దరు కుమారులు తండ్రి ఉన్నారు.ఆ మేరకు స్థానిక ఎస్సై రాజశేఖర్ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఫ్రెండ్స్ కు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని ఆత్మహత్యకు ముందు రెండు పేజీల లేఖ కూడా ఆ మృతి చెందిన యువకుడు వ్రాసినవి అక్కడ స్థలంలో లభ్యమయ్యాయి.నవీన్ ఆత్మహత్యకు గల అసలు కారణాలు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆర్కేపి లో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్... జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-25,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ ప్రధాన రహదారి పై బుధవారం రాత్రి అర్థగంట క్రితం ట్రాక్టర్ ఢీకొనడంతో మందమర్రి కి చెందిన పి.మల్లేశ్వరి(38) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.ఆ క్రమంలో చూస్తే...బైకుపై ఇద్దరు వస్తుండగా ఎదురుగా ఒక ట్రాక్టర్ కూడా రావడంతో అదే సమయంలో 2 ఎద్దులు పోట్లాడుతూ బైక్ మీదకు రావడంతో బైక్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఎడమవైపు ఆ బైకుపై కూర్చున్న మహిళ కుడివైపు పడడంతో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఆమె తల మీద వెళ్ళింది.దాంతో ఆమె తల పగిలి మెదడు బయటికి వచ్చి తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది.ప్రధానంగా చూస్తే..ట్రాక్టర్ డ్రైవర్ స్పీడ్ తో డ్రైవింగ్ చేయడం అలాగే ఎద్దులు కూడా బైకు మీదకు రావడం చేత అవి పోట్లాడుకోవడం చేత బైకుకు ఎదురుంగా అడ్డంగా రావడంతోనే ఆ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.ఆ విషయం తెలిసిన వెంటనే రామకృష్ణాపూర్ స...
గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ సినియర్ కాంగ్రెస్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య అనారోగ్య బారినపడ్డ విషయం తెలుసుకొని వారి ఇంటికి వచ్చి శుక్రవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు.కుటుంబ సభ్యులను ట్రీట్మెంట్ విషయాలను అడిగి తెలుసుకొని అన్ని విధాలుగా సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు.అనంతరం ఇటీవల పున:ప్రారంభించిన కాజిపేట్ అజ్ని పాసెంజర్ ట్రైన్ పురస్కరించుకొని స్థానిక రవీంద్ర ఖని రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వని విషయాన్ని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపి దృష్టికి తీసుకెళ్లారు.ఆ విషయమై దక్షిణ మధ్య రైల్వే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.ఇటీవల కాలంలో మరణించిన కాంగ్రెస్ నాయకులు కుదిరే రామస్వామి తండ్రి కుదురే రాజయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.వాళ్ల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామకృష్ణాపూర్ అధ్యక్షులు పల్లె రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment