క్యాతనపల్లిలో బిఆర్ఎస్-సిపిఐ హవా!మెజార్టీ స్థానాలు దక్కించుకుంది
క్యాతనపల్లిలో బిఆర్ఎస్-సిపిఐ హవా!మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది
జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-13,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు జరిగిన పోలింగ్ లో శుక్రవారం పట్టణంలో ఆర్కేసిఓఏ క్లబ్లో కౌంటింగ్ ప్రక్రియ భారీ ఎత్తున నిర్వహించారు.దాంట్లో చూస్తే..1వ వార్డు నుంచి 22 వార్డు వరకు ప్రజల ఓట్ల చేత గెలుపొందిన బిఆర్ఎస్,సీపీఐ,కాంగ్రెస్ పార్టీలతోపాటు ఇండిపెండెంట్ గా గెలుపొందిన అభ్యర్థుల పేర్లను సంబంధిత అధికారులు ప్రకటించారు.దాంట్లో చూస్తే..ఒకటో వార్డు సిపిఐ అభ్యర్థి సాంబయ్య కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ పై గెలుపొందాడు.రెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పొల్లూరి కళ్యాణ్ భార్య సిపిఐ అభ్యర్థిని ఆర్.లక్ష్మణ్ భార్యపై గెలుపొందారు.మూడవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మల్లమ్మ బిఆర్ఎస్ అభ్యర్థిని జయమ్మ పై గెలుపొందారు.నాలుగో వార్డు బైఆర్ఎస్ అభ్యర్థి జంజిపల్లి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామగిరి శ్రీనుపై గెలుపొందాడు.ఐదవ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దామర రమేష్ బిఆర్ఎస్ అభ్యర్థి గడ్డం రజితపై గెలుపొందారు.ఆరో వార్డు సిపిఐ అభ్యర్థి ఎం శంకరయ్య కాంగ్రెస్ అభ్యర్థి నక్క శ్రీనుపై గెలుపొందాడు.ఏడో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పొలం సత్యం పై ఇండిపెండెంట్ అభ్యర్థి గుర్రం శ్రీనివాస్ గెలుపొందాడు.ఎనిమిదో వార్డు సిపిఐ అభ్యర్థి ముని కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేశ్వర్లు పై గెలుపొందాడు.9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భీమా మల్లేష్ బిఆర్ఎస్ అభ్యర్థి వంశీ రావు పై గెలుపొందాడు.పదో వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి వీనంక శ్రీను కాంగ్రెస్ అభ్యర్థి పనస రాజు పై గెలుపొందాడు.11వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి బొమ్మ భూమయ్య గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి విక్రంపై గెలుపొందాడు.12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని గోపతి భాగ్య సిపిఐ అభ్యర్థిని గాజుల దివ్యపై గెలుపొందారు.13వ వార్డు అభ్యర్థిని జక్కబోయిన మంజుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పార్వతి విజయపై గెలుపొందారు.14వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పు రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏం రాజ్ కుమార్ పై గెలుపొందారు.15వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిని సతీష్ సంధ్య కాంగ్రెస్ పార్టీ రెడ్డమ్మపై గెలుపొందారు.16వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి గండమల్ల కృపానందం -గ్యాస్ నాని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్య పాల్ పై గెలుపొందారు.17వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిని సంధ్యారాణి రాజా రమేష్ కాంగ్రెస్ అభ్యర్థిని లావణ్యపై గెలుపొందారు.18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని పల్లె రాజు శ్రీదేవి సిపిఐ అభ్యర్థిని వీరవేణి రేణుకపై గెలుపొందారు.19వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిని రంగ లక్ష్మి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గాండ్ల వీణపై గెలుపొందారు.20వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కే.ప్రభాకర్,బిఆర్ఎస్ అభ్యర్థి మంద వేణుగోపాల్ పై గెలుపొందారు.21 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిని బి.స్వర్ణలత కాంగ్రెస్ అభ్యర్థిని జంగం కలపై గెలుపొందారు.22వ వార్డు సిపిఐ అభ్యర్థిని మిట్టపల్లి సరిత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎర్రబెల్లి ప్రేమలతపై గెలుపొందారు.ఆ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులు టపాకాయలు పేల్చుతూ పట్టణంలోని ముఖ్యమైన చౌరస్తాలు వాళ్ళ యొక్క వార్డులలో కలర్లు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ 12 గంటల లోపు గాని రిజల్ట్ ప్రక్రియను సంబంధిత అధికారులు ప్రకటించడం కనిపించింది. ఆ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మంచిర్యాల డిసిపి భాస్కర్,అడిషనల్ కలెక్టర్,ఏసీపీ,మంచిర్యాల ఆర్డీవో,క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్,మందమర్రి సిఐ,ఆర్కేపీ ఎస్ఐల ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహించారు.ప్రధానంగా 24 గంటలు ప్రభుత్వం -ప్రజలకు, జిల్లా రాష్ట్ర పాలన అధికారులకు సమాచారం చేరవేసే స్థానిక ప్రెస్ అండ్ మీడియా జర్నలిస్టులను లోపలికి అనుమతించకపోవడంతో జర్నలిస్టులు అసహనం వ్యక్తం చేశారు.దాంతో మళ్లీ అనుమతించడంతో చాలాసేపటికి నిరసన వ్యక్తం చేసిన జర్నలిస్టులు తిరిగి మళ్లీ కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లి వార్తలను కవరేజ్ చేయడం జరిగింది. శాంతియుతంగా నిజం నిజాలను నిస్వార్ధంగా అందించే జర్నలిస్టులను అగౌరపరిచే విధంగా మరోసారి అలాంటి చర్యలు పునరావృతం కాకుండా లేకుండా చూడాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సంబంధిత అధికారులకు తెలిపారు.
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పదిమంది,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏడుగురు,సిపిఐ అభ్యర్థులు నలుగురు,స్వతంత్ర అభ్యర్థి ఒకరు,మొత్తం 22 మంది అభ్యర్థులు గెలుపు బాటలో ఉన్నారు.
ఆ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్,ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ పట్టణంలోని ఓటరు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Comments
Post a Comment