క్యాతనపల్లిలో పోటీ చేసే అభ్యర్థులు గొడవలు చేయరాదు-సిఐ హెచ్చరికలు

క్యాతనపల్లి కౌన్సిలర్ పోటీ చేసే అభ్యర్థులు గొడవలకు ఆస్కారం ఇవ్వకూడదు 

జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-4,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ఎన్నికలను సామరస్యంగా నిర్వహించుకోవాలని మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి.రమేష్ తెలిపారు.ఎలాంటి గొడవలు,అల్లర్లు చేయకూడదని శాంతియుత వాతావరణంలో మాత్రమే ఎన్నికలు జరిగే విధంగా చూసుకోవాలని సూచించారు.ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోటీ చేసే అభ్యర్థులు వాళ్ల అనుచరులు ఇతరులు ఎవరైనా కూడా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే పోలీసు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఆ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ మారుతి ప్రసాద్,పోటీ బరిలో ఉన్న అభ్యర్థిని,అభ్యర్థులు,సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ