అక్రమ మద్యం బాటిళ్లు పట్టివేత-ఆర్కేపి ఎస్ఐ శ్రీధర్

అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లు పట్టివేత

ఆర్కేపి ఎస్ఐ జే.శ్రీధర్
జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్.....
రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-4,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాతన పల్లి మున్సిపాలిటీలో గల 10వ వార్డులోని ఆల్జా చంద్రయ్య నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 87 లీటర్ల మద్యం(12 కాటన్స్)అంచనా విలువ రూ96,228/-ను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జే.శ్రీధర్ తెలిపారు.మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సంబంధిత మద్యం తెచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు.ఆ విషయంలో చంద్రయ్యను విచారించగా ఆ స్వాధీనం చేసిన మద్యం 10వ వార్డులో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి కాబడిన గోలపెల్లి మహేందర్‌కు చెందినదిగా తేలిందని పోలీసులు కనుగొన్నట్లు తెలిపారు.ఆ సమాచారం అందిన వెంటనే ఎస్‌ఐ జె. శ్రీధర్ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి అక్కడి ప్రాంతంలోని మద్యం స్వాధీనం చేసుకున్నారు.ఆ మేరకు చట్టప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎన్నికల సమయంలో అక్రమ మద్యం,నగదు పంపిణీ వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.ప్రజలు అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని  తెలిపారు

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ