క్యాతనపల్లిలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి
క్యాతనపల్లిలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి
జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-11,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో బుధవారం జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా సజావుగా కొనసాగింది.ఆ క్రమంలో చూస్తే..పట్టణంలోని అన్ని వార్డులకు సంబంధించిన ఓటర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ యొక్క అమూల్యమైన ఓటు హక్కును మంచిగా వినియోగించుకున్నారు.ప్రధానంగా చూస్తే..29 వేల 731 మంది పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లు ఉన్నారు.దాంట్లో మహిళలు 14,998 వరకు ఉన్నారు.అలాగే పురుషులు విషయంలో 14,732 వరకు ఉన్నారు.ముఖ్యంగా అన్ని వార్డులలో సంబంధిత అధికారులు దాదాపు మొత్తంగా 45 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయడంతో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

Comments
Post a Comment