సమాజ రక్షణలో సేవలందించిన పోలీస్ అధికారులకు ఘన సత్కారం.

సమాజ రక్షణలో సుదీర్ఘ సేవలందించిన పోలీస్  అధికారులకు ఘన సత్కారం.

సమాజ శ్రేయస్సు కోసం పనిచేసేది పోలీసులే..

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్

మంచిర్యాల న్యూస్,మార్చి- 1,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్:ప్రజల యొక్క క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని,ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులు ఇకనుంచి వారి కుటుంబాల కోసం ఎక్కువ సమయం కేటాయించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.ఆ క్రమంలో చూస్తే..రామగుండం పోలీస్ కమిషనరేట్లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబ ర్ కిషోర్ ఝా శనివారం ఘనంగా సత్కరించారు.పోలీస్ కమిషనరేట్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు ఎస్సై నక్క శామ్యూల్ పాల్ సీసీఎస్ మంచిర్యాల,ఎస్సై నూనే శ్రీనివాస్ మందమర్రి,ఏ ఎస్ ఐ హెచ్ వెంకటేష్ బాబు గోదావరిఖని వన్ టౌన్,ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎండి అలీముద్దీన్ సి ఏ ఆర్ రామగుండం, హెడ్ కానిస్టేబుల్ ఎం విజేందర్రెడ్డి జూలపల్లి ని పోలీస్ కమిషనర్ పూలమాలలతో ఘనంగా సత్కరించడంతోపాటు జ్ఞాపికలను అందజేశారు.ఆ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. తమ కుటుంబ క్షేమంకన్నా సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనన్నారు.ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులు వారి విధి నిర్వహణ సమయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవడంతోపాటు కొన్ని సమయాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన వారున్నారన్నారు.ఆ కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్,ఏఓ శ్రీనివాస్,ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్,ఆర్ ఐ లు శేఖర్,మల్లేశం,రామగుండం పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్ల కుంట పోచలింగంతోపాటు పదవీవిరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ