2-లక్షలు లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ సిఐ,ఎస్ఐ
2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ సిఐ,ఎస్ఐ
తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక...హైదరాబాద్ న్యూస్,ఏప్రిల్-8,తెలంగాణ జర్నలిస్టు న్యూస్ పేపర్-టీవీ ఛానల్ న్యూస్:నకిలీ పాస్ పోర్ట్ కేసులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ సంపతి కనకయ్య,ఎస్సై సిద్దేశ్వర్,రూ.రెండు లక్షలు లంచం తీసుకుం టూ ఏసీబీ అధికారులకు మంగళవారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.ఆ క్రమంలో చూస్తే...ఆ దాడులు మంగళ వారం సాయంత్రం ప్రారంభ మై అర్ధరాత్రి వరకు కొనసాగాయి.రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం చూస్తే..కేరళకు చెందిన ఒక వ్యక్తి ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తో ప్రయాణించేందుకు ప్రయత్నిస్తూ ఇటీవల కాలంలో అతను పట్టు పడ్డాడు.శంషాబాద్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదు అయింది.అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.కొద్దిరోజుల తర్వాత జైలు నుంచి అతడు రిలీజ్ అయ్యాడు.ఆ నేపథ్యంలోనే అతడు ప్రతి వారం పోలీస్ స్టేషన్ కు హాజరవుతున్నాడు.ఆ కేసులో ఛార్జ్ సీట్ ధాఖలు చేయడానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ కనుకయ్య ఎస్సై సిద్ధేశ్వర్ తో కలిసి ఆ బాధితుడి నుంచి 15 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
----- మహబూబాబాద్ ఏసీబీకి చిక్కిన ఇన్ఛార్జి ఎంఈఓ ......
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్య నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు,ఇన్ఛార్జ్ ఎంఈవో రవికుమార్ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.ఓక పని నిమిత్తం బాధితుడి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయనకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Comments
Post a Comment