ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్..ఆర్కే-5 గనిలో ప్రమాదం-ఇద్దరికి గాయాలు?

ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్..ఆర్కే-5 గనిలో ప్రమాదం-ఇద్దరిలో ఒకరికి గాయాలు,మరొకరికి తీవ్ర గాయాలు!

తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక...

శ్రీరాంపూర్ న్యూస్,తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక న్యూస్-టీవీ ఛానల్ న్యూస్,ఏప్రిల్-9:సింగరేణి కాలరీస్ లోని శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోగల ఆర్కే ఐదు గనిలో గురువారం రెండవ షిఫ్ట్ లో జరిగిన ఒక ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.ఆ క్రమంలో చూస్తే...గని భూగర్భంలో వేల్డర్ గా పనిచేస్తున్న వేణుగోపాల్ అనే కార్మికుడు ఇనుప రాడ్లను వెల్డింగ్ చేస్తున్న సమయంలో దాంట్లో ఒక చిన్న రాడ్ చువ్వలు మిరుగులు వెళ్లి అక్కడే ఉన్న పాత పూర్ణికి తగలడంతో అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందనీ తెలుస్తుంది.ఆ ప్రమాదంలో వేణుగోపాల్ పై బ్లాస్టింగ్ వల్ల ఒక్కసారిగా బొగ్గు పిల్లలు ఇనుపరాడులు అన్ని కూడా మీద పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.అలాగే అతని హెల్పర్ కు కూడా స్వల్పంగా గాయాలు పాలయ్యాడు. వెంటనే రామకృష్ణాపూర్ లోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించడంతో ఆ ఇద్దరు కార్మికులు చికిత్స పొందుతున్నారు.దాంట్లో వేణుగోపాల్ కు బలమైన గాయాలు కావడంతో ఎక్స్రేలు తీసారు.ఆయన దేహంలో చిన్న చిన్న ఇనుప ముక్కలు ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తుంది.ఆ బాధిత వెల్డర్ కు మెరుగైన వైద్య చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.మరింత మెరుగైన రిపోర్ట్ కోసం వైద్యులు చికిత్స చేస్తున్నారు.ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.నిజానిజాలు మెరుగైన వార్తల కోసం చూస్తూనే ఉండండి.తప్పకుండా చదవండి తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక-తెలంగాణ జర్నలిస్టు న్యూస్ ఛానల్.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ