ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో గంభీరంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో నమ్మకంగా గుడ్ ఫ్రైడే వేడుకలు 








 ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో నమ్మకంగా గుడ్ ఫ్రైడే వేడుకలు 

-  తెల్లటి వస్త్రాలు ధరించిన  క్రైస్తవులు ప్రార్థించారు 

-  రెవరెండ్ పాస్టర్ ఎం.జాషువా దైవ సందేశం

-  తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్..

రామకృష్ణాపూర్ న్యూస్,ఏప్రిల్-3,తెలంగాణ జర్నలిస్టు డైలీ న్యూస్ పేపర్- తెలంగాణ జర్నలిస్టు టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సెయింట్ పీటర్స్-సిఎస్ఐ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే(శుభశుక్రవారం)వేడుకలు చాలా విశ్వాసంతో ఎంతో నమ్మకంగా క్రైస్తవ సోదరీ సోదరులు భారీ ఎత్తున నిర్వహించుకున్నారు.ఆ క్రమంలో చూస్తే... సి ఎస్ ఐ చర్చి పాస్టర్ రెవరెండ్ ఎం.జాషువా ఆధ్వర్యంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గుడ్ ఫ్రైడే ఆరాధన పాటలు గేయాలతో అత్యంత భక్తిశ్రద్ధలతో గొప్ప విశ్వాసంతో ఘనంగా చేపట్టారు.ఆ సందర్భంగా యేసు క్రీస్తు ప్రభువు సిలువలో మరణించినప్పుడు ఆయన చివరిసారిగా మాట్లాడిన ఆ ఏడు మాటలను క్రైస్తవ సోదరీ సోదరులు బైబిల్ లోని వాక్యాల ద్వారా దేవాలయంలో చదివి వినిపించారు.దాంట్లో చూస్తే... పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు ప్రభువు పలికిన మాటలలో మొదటి మాటగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరుని క్షమించమని యేసు క్రీస్తు ప్రభువు చెప్పాడు.రెండవ మాటగా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను.మూడవ మాటగా అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను.నాలుగవ మాటగా ఏలి..ఏలి.. లామా సభాక్తనీ అని ఏసుక్రీస్తు ప్రభువు బిగ్గరగా కేక వేశాను.ఐదవ మాటగా లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనేను.ఆరవ మాటక ఆ చిరకపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను.ఏడవమాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు ప్రభువు పలికిన ఆ ఏడు మాటలను బైబిల్ గ్రంధంలోని దేవుని వాక్యాలను గుర్తు చేసుకున్నారు.ఆ సందర్భంగా పాస్టర్ జాషువా క్రైస్తవులను ఉద్దేశించి దేవుని సందేశం అందివ్వడంతో పాటు అందరు సంతోషంగా ఉండాలని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థనలు చేశారు.ఆ చర్చి యొక్క వేడుకలకు సహకరిస్తున్న పోలీస్ అధికారులు చర్చి ఫాస్ట్ రేట్ కమిటీ సభ్యులకు అందరికీ ముఖ్యంగా తెలంగాణ జర్నలిస్టు పేపర్ ఎడిటర్ కలవల శ్రీనివాస్ కు ప్రత్యేక అభినందనలు ధన్యవాదములు తెలిపారు.ఆ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చి కమిటీ సభ్యులు,క్రైస్తవ సోదరి,సోదరులు,యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ