ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో సంబరాలతో ఈస్టర్ పండుగ వేడుకలు!

యేసుక్రీస్తు ప్రభువు పున:రుత్థానుడై మూడవరోజు మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు 

- ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో సంబరాలతో ఈస్టర్ పండుగ వేడుకలు

-



యేసు సిలువపై కొవ్వొత్తులతో విరజిల్లే వెలుగు దీపాలు 

- పాస్టర్ ఎం జాషువా దైవ సందేశం...

- తెలంగాణ జర్నలిస్టు పేపర్...

రామకృష్ణాపూర్ న్యూస్,ఏప్రిల్-5,తెలంగాణ జర్నలిస్టు న్యూస్ పేపర్-తెలంగాణ టీవీ ఛానల్ న్యూస్: ప్రపంచ మానవాళిని రక్షించడానికి సిలువ వేయబడిన పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువు పున:రుత్తానుడై మూడవ దినము తిరిగి లేచాడు.ఆ క్రమంలో చూస్తే...మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సిఎస్ఐ-సెయింట్ పీటర్స్ చర్చి దేవాలయంలో ఆదివారం ఈస్టర్ పండుగ వేడుకలు భారీ ఎత్తున నిర్వహించారు.ఆ నేపథ్యంలోనే ఉదయం నాలుగు గంటలకే క్రైస్తవులు ఆలయానికి చేరుకొని ఏసుక్రీస్తు ప్రభువుకు మహిమ కనపరిచే విధంగా భక్తిశ్రద్ధలతో అత్యంత విశ్వాసంతో ఆరాధించారు. ఆ సందర్భంగా చర్చి దైవ సేవకులు రేవా.పాస్టర్ ఎం.జాషువా దేవుని సందేశంను ఆయన ప్రసంగం ద్వారా వివరించారు. కాగా ఏసుక్రీస్తు ప్రభువు మరణమును జయించి సజీవుడుగా ప్రత్యక్షమయ్యాడనీ గుర్తు చేశారు.అయితే బాధలో ఉన్న వారందరికి ఆ క్రీస్తు ప్రభువు దేవుడు దర్శనంతో సజీవుడైన దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు అందరికీ సహాయం చేయడానికి మళ్ళీ తిరిగి వచ్చాడనీ స్పష్టం చేశారు.ఆయన యొక్క ప్రజలను దేవుని శక్తితో బలపరుస్తాడనీ గుర్తు చేశారు.దాంతో బైబిల్ గ్రంధంలోని దేవుని మాటలు చదివి వినిపించి.గుర్తు చేశారు.ఏసు క్రీస్తు ప్రభువు మరణంతో తమకు ఇంకా ఎవరు ఎవరు లేరని అధైర్య పడడంతో పాటు భయపడిన ప్రజలకు కనిపించి ధైర్యం కల్పించిన ఘనత క్రీస్తు ప్రభువుకే దక్కిందన్నారు.దాంతో దేవుని ప్రియులకు పునరుత్థాన శక్తి ఇస్తాడని ఇంకా అసాధ్యమును సాధ్యం కూడా చేస్తూ చిరకాలంగా అండగా దేవుడు ఉంటారనీ వర్ణించారు.ఆ దేవుడు ప్రత్యక్షమై వాగ్దానాలు చేసినట్లు.లోకానికి రక్షకుడై గొప్పగా వెలుతురును క్రీస్తు ప్రభువు అందించాడనీ వర్ణించారు.కాగా ఈస్టర్ పండుగతో సంతోషంగా ఆరాధన సంబంధిత దేవాలయంలో చేపట్టినట్లు ప్రకటించారు.ఆదేవుడు అందరిని ప్రేమిస్తాడనీ ఆదరిస్తాడని సహాయం కూడా చేస్తాడని ఆర్థిక ఇబ్బందులు తొలగించడంతోపాటు అనారోగ్య సమస్యలపై స్వస్థత కల్పిస్తాడని క్రైస్తవులు దేవుని పాటలతో ఆరాధించారు.స్థానిక క్రైస్తవులు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థనలు చేశారూ.పాటలు పాడారు,పరిశుద్ధుడైన బైబిల్ గ్రంధంలోని దేవుని వాక్యాలు చదివారు.దేవుడు ప్రత్యక్షమై ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన సువార్తను  గుర్తు చేసుకున్నారు.యేసుప్రభు దేవుడు గుడ్ ఫ్రైడే శుభశుక్రవారం రోజున శిలువ వేసిన తరువాత మూడవ దినం తిరిగి లేచాడని ఆ తరుణంలో ఈస్టర్ పండుగ యొక్క విశిష్టతను క్లుప్తంగా వివరించారు.ఆ వేడుకలలో సిఎస్ఐ చర్చి కమిటీ సభ్యులు,క్రైస్తవులు,యువతీ-యువకులు,క్రైస్తవ సోదరి-సోదరులు,చిన్న పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ