సూర్యపేట ఆపిల్ స్కాన్ సెంటర్ పై(సువో మోటో)విచారణ

సూర్యపేట ఆపిల్ స్కాన్ సెంటర్ పై(సువో మోటో)విచారణ 

-- తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక...

తెలంగాణ మెడికల్ కౌన్సిల్

సూర్యాపేటలోని ఆపిల్ స్కాన్ సెంటర్‌లో జరిగిన అనైతిక కార్యకలాపాలపై స్వయంగా(సువో మోటో)విచారణ చేపట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.ఆ విచారణలో డా.కిరణ్ కుమార్ సోమ(రిజిస్ట్రేషన్ నం.59019)తాను గుర్తింపు పొందిన అర్హతలు లేకపోయినా,తాను క్వాలిఫైడ్ రేడియాలజిస్టుగా తప్పుడు విధంగా పరిచయం చేసుకున్నట్లు నిర్ధారించబడింది.అలాగే అతను గడువు ముగిసిన రిజిస్ట్రేషన్‌తో వైద్య సేవలు కొనసాగించడమే కాకుండా,తప్పుడు పత్రాలు సమర్పించిన వ్యవహారంలో కూడా పాల్గొన్నట్లు తెలిసింది.ఈ ఉల్లంఘనలను దృష్టిలో ఉంచుకుని,కౌన్సిల్ అతని పేరును మెడికల్ రిజిస్టర్ నుంవంచి రెండు సంవత్సరాల పాటు తొలగించాలని ఆదేశించింది.ఆ విషయానికి సంబంధించి డా.షేక్ జుల్ఫకర్ అలీ(రిజి. నం. 62456) చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ లేకుండా వైద్య సేవలు అందించినట్లు తేలింది.దానికి సంబంధించి,కౌన్సిల్ అతనిపై సెన్సర్ తీవ్రమైన హెచ్చరిక విధించింది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ