Posts

అంత్యక్రియలకు డబ్బుల్లేక మూడు రోజులు మృతదేహంతోనే

Image
అంత్యక్రియలకు డబ్బుల్లేక మూడు రోజులు మృతదేహంతోనే కుటుంబం   మానవత్వం చాటిన పోలీసులు,స్వచ్ఛంద సంస్థ జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ-న్యూస్.... హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల షాపూర్‌నగర్ సమీపంలో ఉన్న ఎన్ఎల్‌బీనగర్ ప్రాంతంలో ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.ఆ క్రమంలో చూస్తే..మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 76 ఏళ్ల స్వామిదాస్ అనే వృద్ధుడు మరణించగా అతని అంత్యక్రియలు నిర్వహించడానికి డబ్బులు లేక అతని కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. స్వామిదాస్ చిన్న కూతురు సలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేది.అయితే తన తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో అతడిని చూసుకోవడానికి ఉద్యోగం మానేసింది.ఆ నేపథ్యంలోనే స్వామిదాస్ ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించాడు.దాంతో అంత్యక్రియలు జరిపించడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో ఏమి చేయలేక మూడు రోజులుగా ఆ మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని జీవించారు. గత మూడు రోజులుగా ఆ కుటుంబ సభ్యులు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆ ఇంటి యాజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.ఘటన...

5-డిసెంబరు1956న డా.అంబెడ్కర్ కన్నుమూశారు-జోహార్లు

Image
5 డిసెంబర్ 1956న భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబెడ్కర్ కు అదే చివరి రోజు -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక--టీవీ న్యూస్ ప్రత్యేకం...  ఆనాటి దినచర్యలో ఉదయం 7.00 సమయంలో... - సాధారణం కంటే ఆలస్యంగా మేలుకొన్నారు.శరీరం చాలా బరువుగా,నొప్పిగా ఉంది.   - సవితాబాయి అంబేడ్కర్ సహాయంతో మంచం మీదే కూర్చొని ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకున్నారు. ఉదయం 8:00 గంటలకు   - షుగర్ లేని కాఫీ తాగారు.  - టిఫిన్ చాలా తక్కువగా   - రోజువారీ వార్తాపత్రికలు (Times of India, Hindu, Indian Express) చదివారు. కానీ ఆ రోజు ఎక్కువసేపు చదవలేకపోయారు – కళ్ళు మసకగా కనిపించాయి. ఉదయం 10:00 గంటలకు - మంచం మీదే ఉండి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు.   - ఆ తర్వాత లైబ్రరీ గదికి వీల్‌చైర్‌లో వెళ్లారు. “The Buddha and His Dhamma” పుస్తకం యొక్క ఆఖరి ప్రూఫ్‌లు చూశారు.   - తన సహాయకుడు నానక్ చంద్ రట్టూకు కొన్ని చిన్న సవరణలు డిక్టేట్ చేశారు. - మధ్యాహ్నం1:30 గంటలకు  - మళ్లీ చాలా తక్కువ భోజనం (అన్నం కొద్దిగా, కూర ఒకటి).   - భోజనం అయ్యాక మందులు వేసుకుని మళ్లీ మంచం మీద పడుకున్నారు...

ఆర్కేపి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్ద సుల్తాన్ శ్రీనివాస్ మృతి

Image
ఆర్కేపి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్ద సుల్తాన్ శ్రీనివాస్ మృతి ఎస్ఐ జి.రాజశేఖర్ కేసు ధర్యాప్తు రామకృష్ణాపూర్ న్యూస్,డిసెంబరు-5,జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ఠాగూర్ నగర్ కు చెందిన సుల్తాన్ శ్రీనివాస్(48)అనే లేబర్ వ్యక్తి పట్టణంలోని అంబేద్కర్ అంగడి బజార్ ముందుగల ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కేట్ కన్స్ట్రక్షన్ వద్ద శుక్రవారం మృతి చెంది ఉండటం కనిపించింది.అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఆ మృతుడు అక్కడి ప్రదేశంలో                             శవమై కనిపించాడు.అతని నోటిలో నుంచి నురుగు వచ్చి ఉంది.అతని తలకు రక్తం మరకలు కూడా ఉన్నాయి.కాగా మృతి చెందిన శ్రీనివాస్ ప్రతినిత్యం మద్యం సేవించేవాడని తెలిసింది. ఆ మేరకు ఆర్కేపి పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్ అక్కడి సంఘటన స్థలానికి చేరుకోని కేసు నమోదు చేసుకొని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.మృతి చెందిన శ్రీనివాస్ భార్య పట్టణంలోని సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్లో కాంట్రా...

ఆర్కేఓసిపి పేజ్-2లో దళారులు వద్దు-నష్టపరిహారమే కావాలి

Image
ఆర్కేఓసిపి పేజ్-2లో దళారులు వద్దు-నష్టపరిహారం కావాలి జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్.....  

ఆర్కేపి మెగా ఓసి ఫేజ్-2పై ప్రజాభిప్రాయ సేకరణ హోరాహోరీగా సాగింది

Image
ఆర్కేపి మెగా ఓసి ఫేజ్-2పై ప్రజాభిప్రాయ సేకరణ హోరాహోరీగా సాగింది  - 48 మంది అభిప్రాయాలు వ్యక్తం చేసిన వైనం..  - 46 వినతి పత్రములను అధికారులకు అందించారు  - ఆర్కే-4 గడ్డలోని 350 కుటుంబాలకు ఉద్యోగం,ఇల్లు,నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి  - ర్యాలీగా తరలివచ్చిన ఓపెన్ కాస్ట్ బాధిత కుటుంబాలు  - మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య,పర్యావరణ శాఖ ఇంజనీర్ లక్ష్మణరావు ప్రసాద్ విచ్చేశారు  -  పోలీసు అధికారులు,సింగరేణి ఎస్ అండి పిసి భారీ ఎత్తున బందోబస్తు  - నాలుగున్నర గంటలు పాటు కంటిన్యూగా సాగిన ప్రజాభిప్రాయ సేకరణ - ఆ ప్రజాభిప్రాయ సేకరణలో నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని ప్రకటన రామకృష్ణాపూర్ న్యూస్,డిసెంబర్-3,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : సింగరేణి కాలరీస్ లోని మందమర్రి డివిజన్ పరిధిలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కేపీ మెగా ఓసి ప్రాజెక్టు ఫేజ్ -2 యొక్క పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రోగ్రాంను బుధవారం సింగరేణి యాజమాన్యం పెద్ద ఎత్తున నిర్వహించింది.దాంతో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ హోరా హోరీగా సాగింది.ఆ క్రమంలో చూస్తే..పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి కాంట్...

ఆర్కేపిలో డిసెంబర్ 26న సిపిఐ బహిరంగ సభను సక్సెస్ చేయండి

Image
ఆర్కేపిలో డిసెంబర్ 26న సిపిఐ బహిరంగ సభను సక్సెస్ చేయండి  ఆర్కేపిలో డిసెంబర్ 26న సిపిఐ బహిరంగ సభను సక్సెస్ చేయండి  - మంచిర్యాల సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ రామకృష్ణాపూర్ న్యూస్,డిసెంబరు-2,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ యూనియన్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు.ఈనెల 26న సిపిఐ శత జయంతి ఉత్సవాల ముగింపు పురస్కరించుకొని రామకృష్ణాపూర్ పట్టణంలో భారీ ఎత్తున బహిరంగ సభ  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఆ సభకు ప్రజాసంఘాల శ్రేణులు పార్టీ నాయకులు కార్మికులు కర్షకులు సానుభూతిపరులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఆ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలి వస్తున్నట్లు దాంతో ఆ సభకు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు విచ్చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్ కే పి ఓ సి ఫేజ్-2 ప్రాజెక్ట్ పై సింగరేణి యాజమాన్యం,అధికారులు బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ(పబ్లిక్ హియరింగ్) నిర్వహిస్తున్నట్లు ఆ ప్రాజెక్టు వలన రామకృష్ణాపూర్ లో ఉన్న ప్రజలకు కాలనీలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో...

కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం-కోట్లలో ఆస్తి నష్టం

Image
కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం-కోట్లలో ఆస్తి నష్టం  తెలంగాణలోని కొండగట్టు వద్ద రాత్రి భారీ అగ్నిప్రమాదం -- 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధం -- సమ్మక్క జాతర కోసం నిల్వ ఉంచిన సరుకు బూడిద -- కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరిగిందని అంచనా -- విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక నిర్ధారణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,నవంబరు-30: తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం కాబడిన కొండగట్టులో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.ఆ క్రమంలో చూస్తే..సంబంధిత దుర్ఘటనలో దాదాపు 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.దాంతో వ్యాపారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.గత రాత్రి 11 గంటల సమయంలో కొండగట్టు ఘాట్ రోడ్డులోని అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న బొమ్మల దుకాణాల్లో మంటలు చెలరేగాయి.ఆ సమీపంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు భారీ ఎత్తున బొమ్మలను కొనుగోలు చేసి వాళ్ల యొక్క దుకాణాల్లో నిల్వ ఉంచారు.ఒక్కో దుకాణంలో రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది.ఆ ...