క్యాతనపల్లి కమాన్ ముందు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి?
.jpg)
క్యాతనపల్లి కమాన్ ముందు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి? --- రోడ్డు ప్రమాదాలు లేకుండా రక్షణ కల్పించాలి --- జర్నలిస్టు తెలుగు దినపత్రిక--టీవీ న్యూస్ ప్రత్యేక కథనం.... రామకృష్ణాపూర్ న్యూస్ మే-19 జర్నలిస్టు తెలుగు దినపత్రిక -టీవీ మీడియా న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రధాన మార్గం కాబడిన కమాన్ ముందు రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ సిగ్నల్ లేదా ట్రాఫిక్ నిబంధనలు లేదా ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.ఆ క్రమంలో చూస్తే..క్యాతనపల్లి కమాన్ ముందు గల రహదారిపై ఇటీవల కాలంలో ఊహించని విధంగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది.దాంతో అక్కడి ప్రాంతంలో ఏంఎన్ఆర్ గార్డెన్ వెళ్లాలని అలాగే పెట్రోల్ బంక్ కు వెళ్లాలని లేదా ఆంజనేయ టెంపుల్ కి వెళ్లాలని అటుపక్కనే గ్రామంలోకి వెళ్లాలని మళ్లీ అటువైపు నుంచి రామకృష్ణాపూర్-క్యాతనపల్లి మున్సిపాలిటీకి వచ్చి వెళ్లే వాళ్లకు అక్కడి రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనలు లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.ఈ విషయంలో మంచిర్యాల ఆర్ అండ్ బి అధికారులు,సంబంధిత అధికారులు కూడా వ...