Posts

అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు-మంత్రి పొంగులేటి

Image
అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు-మంత్రి పొంగులేటి --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్... హైదరాబాద్ న్యూస్ మే-9 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..ప్రెస్ అకాడ‌మీ భ‌వ‌నాన్ని ఈ నెలాఖ‌రులోగా ప్రారంభిస్తామ‌ని ప్రకటించారు.అయితే వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలవారీగా పెన్షన్,తీవ్ర అనారోగ్యం,ప్రమాదాలకు గురై వృత్తి నిర్వహించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు శుక్రవారం నాంపల్లి ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..ఆనాటి ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ప్రెస్ అకాడమీ భవనానికి మరమ్మ‌తులు పూర్తి చేయించి ఈ నెలా ఖరులో ప్రారంభిస్తామని తెలిపారు.కాగా మండల,నియోజకవర్గ స్థాయిలో పని చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలైన జర్...

ఆర్కేపి ఠాగూర్ స్టేడియంలో రెండు రోజులు వాలీబాల్ క్రీడా పోటీలు

Image
ఆర్కేపి ఠాగూర్ స్టేడియంలో రెండు రోజులు వాలీబాల్ క్రీడా పోటీలు  -  యువత చెడు మార్గంలో కాకుండా క్రీడారంగంలో రాణించాలి... -  ఎస్ఐ జి.రాజశేఖర్,మున్సిపల్ కమిషనర్ జి.రాజు -  వాల్ పోస్టర్లు విడుదల చేసిన క్రీడా పోటీల నిర్వాహకులు  -  జర్నలిస్టు తెలుగు దినపత్రిక- టీవీ మీడియా న్యూస్ రామకృష్ణాపూర్ న్యూస్ మే-7 జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ మీడియా న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఈ నెల 10,11వ తేదీలలో ఆర్ ఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆర్ కే పి పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్,క్యాతనపల్లి మున్సిపాలిటీ కమీషనర్ జి.రాజు తెలిపారు.ఆ క్రమంలో చూస్తే...పట్టణంలోని సింగరేణి టాగూర్ స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ ఇద్దరూ అధికారులు వాలీబాల్ క్రీడ పోటీలకు సంబంధించిన విషయమై మాట్లాడారు.ప్రధానంగా యువత చెడు మార్గాలను ఎంచుకోకుండా క్రీడా స్ఫూర్తితో మంచిగా క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలని తెలిపారు.అయితే పట్టణంలోని పిఇటిలు,సీనియర్ క్రీడాకారుల పర్యవేక్షణలో సంబంధిత వాలీబ...

ఆ ఇద్దరు మహిళ అధికారినిలు మామూలోళ్లు కాదు?

Image
 ఆ ఇద్దరు మహిళ అధికారినిలు మామూలోళ్లు కాదు? - జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ మీడియా న్యూస్... ఆపరేషన్ సిందూర్ పై కేంద్రం ప్రెస్‌మీట్‌లో ఉన్న ఈ ఇద్దరు మహిళలు మామూలోళ్లు కాదు..వాళ్ల ట్రాక్ రికార్డ్ చూస్తే..!!_* ఆపరేషన్ సింధూర్ : పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఎటాక్ చేసింది. ఉగ్రవాదులు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవారిని, ఆ కేంద్రాలను టార్గెట్ చేసింది.ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు చనిపోయి ఉంటారని భారత్ అంచనా వేస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం ఎనిమిది మంది మాత్రమే చనిపోయినట్టు తెలిపింది. అయితే, 'ఆపరేషన్ సిందూర్'కి సంబంధించి కేంద్రం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ దాడి ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అక్కడే ఎందుకు జరిగిందనే అంశాలకు సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడారు. ఇదే ప్రెస్ మీట్ కి ఇద్దరు మహిళలు ఒకరు ఆర్మీ, ఒకరు ఎయిర్ ఫోర్స్ యూనిఫాంలో అటెండ్ అయ్యారు. వారిద్దరూ ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వారిలో ఒకరు కల్నల్ సోఫియా ఖురేషి, ఇంకొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. *_కల్నల్ సోఫియా ఖురేషి గురించి.._* కల్నల్ ...

పాక్ ఉగ్రవాద స్థావరాలపై "ఆపరేషన్ సింధూర్" యుద్ధం ప్రారంభించిన భారత్ 💥

Image
పాక్ ఉగ్రవాద స్థావరాలపై "ఆపరేషన్ సింధూర్" పేరిట యుద్ధం ప్రారంభించిన భారత్ *💥 బిగ్ బ్రేకింగ్ న్యూస్*... జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... పాక్ ఉగ్రవాద స్థావరాలపై "ఆపరేషన్ సింధూర్" పేరిట భారత సైనికులు యుద్ధం ప్రారంభించారు.అయితే 9 ఉగ్రవాద స్టావారాలపై క్షిపణిలతో దాడి చేసిన భారత్.దాంతో 30 మంది ఉగ్రవాదులు హతం,60 మందికి గాయాలు అయినట్లు సమాచారం గుండా తెలిసింది. ఆపరేషన్ సిందూర్‌లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతం అర్ధరాత్రి 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసిన ఇండియన్ ఆర్మీ యూరీ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులు  LOC వెంట ఉన్న గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన పాక్ ఆర్మీ పాక్ ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మృతి పాక్ సైన్యం కాల్పులను తిప్పికొట్టిన ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతి...

జర్నలిస్టు తెలుగు దినపత్రిక మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు

Image
జర్నలిస్టు తెలుగు దినపత్రిక మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు  --  చైర్మన్-ఎడిటర్ కలువల శ్రీనివాస్ గత 30-సంవత్సరాలుగా జర్నలిస్టు వృత్తిలో నిస్వార్ధంగా నిజాలను ధైర్యంగా దిన పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా టీవీలలో ప్రచురిస్తున్నా-సమాచారంను ఎప్పటికప్పుడు చేరవేస్తున్నా నాకు అండగా ఉంటున్న స్నేహితులు,అభిమానులు,రాజకీయ నాయకులు,ప్రభుత్వ-సింగరేణి అధికారులు,స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు,మహిళా నాయకురాలు,యువ నాయకులు,విద్యార్థి సంఘం నాయకులు,ప్రజా ప్రతినిధులు,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరీ సోదరులు,జర్నలిస్టు డైలీ పేపర్-టీవీ రిపోర్టర్లకు,అన్ని కుల సంఘాల మిత్రులు- సహోదరులకు అందరికీ కూడా పేరుపేరునా ప్రత్యేకమైన వందనంలు -నమస్కారములు తెలుపుతున్నాను.నా యొక్క ముప్పయి యేండ్ల జర్నలిస్టు సేవా సుదీర్ఘ సర్వీసులో అన్ని రకాలుగా చేదు తీపి అనుభవాలను అనేక రూపంలో ఛాలెంజ్ చేస్తూ పట్టుదలతో ఎదుర్కొన్నాను.అయినా కూడా నా నిస్వార్ధమైన సేవే లక్ష్యంగా నిజాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నా దృష్ట్యా ప్రతి సమయంలో ప్రజల యొక్క అందరి ఆదరాభిమానాలు గౌరవం అండదండాలు మీ యొక్క ప్రేమ స్నేహభావంతో పొంది ఉన్నానని మీకందరికీ గౌర...

తెలంగాణలో రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె సైరన్ మ్రోగనుందా?

Image
తెలంగాణలో రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె? --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్... హైదరాబాద్ న్యూస్,మే-6,జర్నలిస్టు తెలుగు దినపత్రిక: తెలంగాణ ఆర్టీసీలో రేపటి నుంచి సమ్మె సైరన్ మోగనుంది.ఆ క్రమంలో చూస్తే..డిమాండ్ల పరిష్కారంలో సర్కార్ జాప్యాన్ని నిరసిస్తూ..టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సిద్ధం అయ్యింది.నేడు మంగళవారం అర్థరాత్రి వరకు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించనట్లయితే రేపు బుధవారం ఉదయం నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.ఈ సమ్మె పిలుపులో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లిలో గల ఆర్టీసీ కళాభవన్ నుంచి ఆర్టీసీ బస్ భవన్ వరకు కార్మిక కవాతు నిర్వహించారు.ఆ సందర్భంగా కార్మికులు యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఆ తర్వాత బస్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ నేతలు ప్రసంగించారు.గత 10ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని మరింత పెరిగాయంటూ వారు విమర్శించారు.అయితే కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం,వేతన సవరణలు చేపట్టడం,కార్మిక సంఘాలను పున:రుద్ధరించడం...

పాకిస్తాన్ కు మరో షాక్ ఇచ్చిన భారత్‌--- ఫ్లాష్..ఫ్లాష్..ఫ్లాష్...

Image
పాకిస్తాన్ కు మరో షాక్ ఇచ్చిన భారత్‌ --    భారత సముద్ర జలాలపై ఆంక్షలు విధింపు --   పాక్‌ ఓడలు భారత పోర్టులకు రావడంపై నిషేధం --   భారత్‌ ఓడలు పాక్‌ పోర్టులకు వెళ్లొద్దని ఆదేశాలు ---  తక్షణమే ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు ****పాక్‌కు మరోసారి ప్రధాని మోడీ వార్నింగ్*** ---   పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తప్పదని స్పష్టీకరణ ---   ఉగ్రవాదులతో పాటు మద్దతుదారులను అంతం చేస్తామని భారత ప్రధాని హెచ్చరిక ---    మరోవైపు దాయాది దేశానికి వరుస షాక్ లు ఇస్తున్న భారత్  ---   పాకిస్తాన్‌కు పోస్టల్‌ సర్వీసులు నిలిపివేత,పాక్‌కు పార్సిల్స్‌, మెయిల్స్‌పై నిషేధం,పాకిస్తాన్‌ వెబ్‌సైట్లపై కూడా బ్యాన్‌. *** 22 మంది పాకిస్థాన్ సైనికులు హతం..*** పాకిస్థాన్ దేశంలోని రెబల్ గ్రూప్ 'బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ' (BLA) చుక్కలు చూపిస్తోంది.తాజాగా తుర్బత్,డుక్కీలో ఆర్మీ కాన్వాయ్లపై అటాక్ చేసింది.ఈ దాడుల్లో 22 మంది పాకిస్థానీ సైనికులు హతమయ్యారు.చాలా మందికి గాయాలయ్యాయి.ఆరుగురు BLA ఫైటర్స్ సైతం మరణించారు.మరో ప్రాంతంలో ఈ ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్ష...