Posts

మంచిర్యాల గురుకులంలో ర్యాగింగ్ కలకలం?

Image
 మంచిర్యాల గురుకులంలో ర్యాగింగ్ కలకలం? --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... చెన్నూరు జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదివే మనోజ్ గౌడ్‌ను ర్యాగింగ్ చేసి దారుణంగా కొట్టిన ఏడుగురు సహచర విద్యార్థులు.ఆ క్రమంలో చూస్తే..మా కాళ్లొత్తు,నీళ్లు తీసుకురా,అడిగినప్పుడు పైసలివ్వు లేదంటే చంపేస్తామని మనోజ్ గౌడ్‌ను బెదిరించిన తోటి విద్యార్థులు.అలాంటి పనులు తాను చేయనని చెప్పినందుకు నెల 6న రాత్రి 10 గంటల సమయంలో మనోజ్ గౌడ్‌ను విపరీతంగా కొట్టిన ఆ ఏడుగురు విద్యార్థులు.కాగా దాడి చేసిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో సోమవారం మనోజ్ గౌడ్ తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిసింది.ఆ విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళనతో ఏడుగురు విద్యార్థులు,పాఠశాల ప్రిన్సిపాల్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. 

మైసమ్మ తల్లి మా..కోరికలు నెరవేర్చమ్మో...

Image
మైసమ్మ తల్లి మా..కోరికలు నెరవేర్చమ్మో...  --  విశేషంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు  --  మూడవరోజు మైసమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో పూజలు --  గాంధారి ఖిల్లా గుట్ట కింద ప్రజా దర్బార్  --  ముఖ్యఅతిథి చెన్నూర్ ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి ప్రసంగం.. --  మందమర్రి సిఐ కే.శశిధర్ రెడ్డి ప్రసంగం...  రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 16 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల బొక్కలగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర ఆదివారం మూడవరోజు విశేషంగా వేలాది సంఖ్యలో భక్తులు హాజరైనారు.ఆ నేపథ్యంలోనే ఉదయం నుంచి మైసమ్మ తల్లి మహా జాతర చివరి రోజు పెద్ద ఎత్తున కొనసాగింది.అయితే ఈ నెల 14 నుంచి ప్రారంభమైన ఆ మైసమ్మ తల్లి మహా జాతర నేటి ఆదివారంతో ముగుస్తుంది.కాగా చివరి రోజు భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడి జాతరకు తండోపతండాలుగా హాజరైనారు.దాంతో కోరికలు తీర్చే మైసమ్మ తల్లికి కోళ్లు మేకలను బలి అర్పణలు చేశారు.అనంతరం గుట్ట కిందనే వంటలు వండుకొని కుటుంబ సమేతంగా భక్తులు భోజనాలు చేయడం జరిగింది.దానికి ముందు గుట్టమీదికి చే...

గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరలో పర్యటించిన ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త

Image
 గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర లో పర్యటించిన ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త  --  మైసమ్మ మహా జాతర ఏర్పాట్లను తెలుసుకున్నా వైనం  --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 15 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల గాంధారి ఖిల్లా మూడు రోజుల మైసమ్మ మహా జాతరలో భాగంగా రెండోవ రోజు శనివారం ఉట్నూర్ ఐటీడీఏ పిఓ అధికారిని కుష్బూ గుప్తా ఏట్టకేలకు అక్కడి జాతరలో పర్యటించారు.ఆ క్రమంలో చూస్తే..ఆర్డీవో శ్రీనివాస్ తో కలిసి ఈరోజు గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర చేరుకొన్నారు.ఆ నేపథ్యంలోనే గుట్టపైకి చేరుకొని మైసమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.అనంతరం ఆదివాసీ నాయక్ పోడు గిరిజన సంఘం నాయకులతో మాట్లాడారు.ఆ జాతర యొక్క ఏర్పాట్లు ఇంకా అక్కడ భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటుచేసిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్ ఎస్ఐ జి.రాజశేఖర్,ఆదివాసీ నాయక్ పోడు సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్,సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మేసినేని రాజయ్య,ఆదివాసి నాయక్ పోడు సంఘం రాష్ట్ర ...

మంచిర్యాల కోర్టు ప్రాంగణంలో రక్తదాన శిబిరం

Image
 మంచిర్యాల కోర్టు ప్రాంగణంలో రక్తదాన శిబిరం -  ముఖ్యఅతిథి జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులు -  38 మంది దాతలు స్వచ్ఛందంగా రక్తదానం  -   మంచిర్యాల జడ్జి ప్రసంగం... -  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ !! మంచిర్యాల న్యూస్ ఫిబ్రవరి 15 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి బోయ శ్రీనివాసులు -మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ ల యొక్క సహకారంతో లయన్ వి.మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో మంచిర్యాల పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు.ఆ రక్తదానం శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ స్టేషన్స్ డిస్ట్రిక్ట్స్ జడ్జి బోయ శ్రీనివాసులు వాళ్ల యొక్క సతీమణి శ్రీదేవిలు హాజరైనారు.దాంతో ఆ జడ్జి దంపతులు ముందుగా రక్తదానం చేశారు.ఆ తరుణంలో జడ్జి దంపతులు అందరికీ ఆదర్శంగా కూడా నిలిచారు.అనంతరం రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించారు.అలాగే సీనియర్ సివిల్ జడ్జిలు రామ్మోహన్ రెడ్డి,నిరోషా,సంపత్, నరసయ్య,ఏవో రామబ్రహ్మం,సాగర్,చారి, మంజుల,బ...

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులు నేడు ప్రభుత్వానికి అప్పగింత?

Image
తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులు నేడు ప్రభుత్వానికి అప్పగింత? ---  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత ఆస్తుల జప్తు ---  బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆస్తులు ---   10 వేల చీరలు,750 జతల పాదరక్షలు,27 కిలోల బంగారం సహా మరెన్నో ఆస్తులు --   జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్.... జర్నలిస్టు తెలుగుదిన పత్రిక ఫిబ్రవరి 15 :  బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో భద్రపరిచిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తులు,పత్రాలను కోర్టు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు.వాటిలో 10 వేల చీరలు,750 జతల పాదరక్షలు,27 కిలోల బంగారం,వజ్రాభరణాలు,రత్నాలు,601 కిలోల వెండి వస్తువులు,1,672 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు,నివాసాలకు సంబంధించిన దస్తావేజులు,8,376 పుస్తకాలు ఉన్నాయి.వాటిని భారీ భద్రత మధ్య ఆరు ట్రంకు పెట్టెల్లో తరలించారు.న్యాయమూర్తి హెచ్ఎన్.మోహన్ సమక్షంలో వాటిని అధికారులకు అప్పగించారు.ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయింది.ఆ క్రమంలోనే అక్కడ జప్తు చేసిన ఆస్తులు,పత్రాలను కర్ణాటకకు తర...

కుల గణన సర్వే నా కోసం నా పదవి కోసం చేయలేదు: సీఎం రేవంత్ రెడ్డి

Image
కుల గణన సర్వే నా కోసం నా పదవి కోసం చేయలేదు: సీఎం రేవంత్ రెడ్డి ---  నేను ఆఖరి 'రెడ్డి' ముఖ్యమంత్రిని అయినా ఫర్వాలేదు ---  కార్యకర్తగా మిగిలిపోయేందుకు సిద్ధం: రేవంత్ రెడ్డి ---  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్.... హైదరాబాద్ న్యూస్ ఫిబ్రవరి14 :నేను ఆఖరి 'రెడ్డి' ముఖ్యమంత్రిని అయినా ఫర్వాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.ఆ క్రమంలో చూస్తే..మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నా ఇది నా నిబద్ధత,కుల గణన సర్వే నా కోసం నా పదవి కోసం చేయలేదు త్యాగానికి సిద్ధపడే కులాల లెక్కలు పక్కాగా తేల్చామన్నారు.మా నాయకుడి ఆదర్శం నిలబట్టేందుకు నేను కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు కుల గణన చేపట్టామన్నారు.కులాల లెక్కలను పక్కాగా తేల్చామని, స్పష్టం చేశారు.హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన కుల గణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటే షన్‌లో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కావడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నా కోసమో,నా పదవి కోసమో కుల గణన చేయలేదన్నారు.కులాల ...

గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరలో పకడ్బందీగా పోలీసు బందోబస్తు

Image
గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరలో పకడ్బందీగా పోలీసు బందోబస్తు  -  బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్  - జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్.... రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 14 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర యొక్క బందోబస్త్ కు వచ్చిన సిబ్బందికి శుక్రవారం బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ఉద్యోగరీత్యా వాళ్లకు సంబంధించిన సూచనలు చేశారు.ఆ సందర్బంగా ఏసిపి రవికుమార్ మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం భక్తులు గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లినీ దర్శనం కోసం వివిధ గ్రామాల నుంచి అధికసంఖ్యలో విచ్చేసి పూజలు చేసి మొక్కులు చెల్లించడం అనవాయితీగా ఉంటుందని తెలిపారు.కాగా మూడు రోజులు అంటే 14-2-2025 నుంచి 16-2-2025 వరకు ఈ జాతర జరుగుతుందని జాతర చివరి రోజున గుట్ట కింద ప్రజా దర్బార్ కూడ చేపడుతున్నట్లు వివరించారు.ఈ జాతర కోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున పెద్దసంఖ్యలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామని,జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించి నిర్దేశించిన ఏరియాలో మాత్రమే వాళ్లకు సంబంధించిన వాహనాలను నిలపాలని,దుకాణాలు పెట్టు కునేవారు ...