Posts

బిసి మహిళలకు రిజర్వేషన్ లలో సబ్ కోటాకై అమరణ దీక్షకు సిద్ధం!

Image
బిసి మహిళలకు రిజర్వేషన్ లలో సబ్ కోటాకై అమరణ దీక్షకు సిద్ధం! తెలంగాణ జర్నలిస్టు డైలీ న్యూస్ పేపర్-టీవీ ఛానల్ న్యూస్... మంచిర్యాల న్యూస్,మార్చి-30:బిసి కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పేరం అలేఖ్య హైకోర్టు ప్రముఖ న్యాయవాది తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. 2023 సెప్టెంబర్ లో బీ జే పీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లులో 33 శాతానికై ఆగ మేఘాల మీద రెండు రోజులు పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లును ఆమోదించడం జరిగినది. ఈ బిల్లులో బీసీ మహిళలకు అవకాశం లేకుండా అగ్రవర్ణాల వాళ్లకు ఉపయోగపడే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు. దీనిని స్వతంత్ర భారతదేశంలోని 80 కోట్ల బీసీ జనాభాలో 40 కోట్ల మంది బీసీ మహిళలము వ్యతిరేకిస్తున్నాము.  ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును 2027లో అమలు చేయటానికి ఆమోదం పొందటానికి మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపయోగపడే విధంగా 33 శాతంలో అర్ధ భాగం 16- 1/2 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుత...

ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో అత్యంత వైభవంగా మట్టల ఆదివారం వేడుకలు

Image
ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో అత్యంత వైభవంగా మట్టల ఆదివారం వేడుకలు ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో అత్యంత వైభవంగా మట్టల ఆదివారం వేడుకలు -  పాస్టర్ రెవారెండ్ ఎం.జాషువా దైవ సందేశం అందించారు -  తెలంగాణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్  రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-29,తెలంగాణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సీఎస్ఐ సెయింట్ పీటర్స్ చర్చి దేవాలయంలో ఆదివారం మట్టల ఆదివారం మహోత్సవం వేడుకలు ఆ చర్చి క్రైస్తవులు అత్యంత వైభవంగా నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..సిఎస్ఐ మెదక్ డయాసిస్ సంఘంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సెయింట్ పీటర్స్ చర్చి బ్రాంచ్ దైవజనులు పాస్టర్ రెవరెండ్ ఎం.జాషువా ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు ఆ సంఘానికి చెందిన క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు.ఆ నేపథ్యంలోనే పట్టణంలోని యూనియన్ బ్యాంకు ముందు గల సిఎస్ఐ చర్చి దేవాలయం నుంచి స్థానిక అంబేద్కర్ అంగడి బజార్ వద్దకు సీఎస్ఐ చర్చి క్రైస్తవులు కొబ్బరి మట్టలు చేత పట్టుకొని పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి ఊరేగింపు చేశారు.దాంతో క్రైస్తవులందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఇద్దరేసి చ...

విద్యార్థినిగా మారి ఆకతాయిలకు చెక్ పెట్టిన మహిళా ఎస్ఐ

Image
విద్యార్థినిగా మారి ఆకతాయిలకు చెక్ పెట్టిన మహిళా ఎస్సై విద్యార్థినుల భద్రత కోసం వినూత్న చర్యలు  పోలీసులపై ప్రజల్లో పెరిగిన నమ్మకం తెలంగాణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్  భూపాలపల్లి న్యూస్ :జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థినుల భద్రత కోసం పోలీసులు తీసుకున్న వినూత్న చర్య ప్రజల్లో విశేషంగా చర్చనీయాంశమైంది.టేకుమట్ల మహిళా ఎస్సై అమూల్య,విద్యార్థిని వేషధారణలో పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యక్షమై ఆకతాయిల ఆటకు చెక్ పెట్టారు.పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్నారనే సమాచారం అందుకున్న వెంటనే, పరిస్థితిని స్వయంగా తెలుసుకుని చర్యలు తీసుకోవాలని ఆమె నిర్ణయించారు. ఖాకీ యూనిఫాం వదిలి, సాధారణ విద్యార్థినిలా ఎరుపు రంగు డ్రెస్సులో చేతిలో పుస్తకాలు పట్టుకుని పరీక్షా కేంద్రానికి వెళ్లారు.విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, పరీక్షా కేంద్రాల వద్ద పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ చర్యతో అక్కడి పరిసరాల్లో శాంతి నెలకొనడంతో పాటు, విద్యార్థినులు ధైర్యంగా పరీక్షలకు హాజరయ్యే పరిస్థితి ఏర్పడింది.మహిళల భద్రతకు పోలీసులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ ఘటన మర...

ఆర్కేపి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో 'అరైవ్ అలైవ్'

Image
ఆర్కేపి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో 'అరైవ్ అలైవ్' ప్రోగ్రాం పట్టణ ఎస్ఐ జే.శ్రీధర్ సూచనలు జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-26,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:రహదారి భద్రతే లక్ష్యంగా చేపట్టిన 'అరైవ్ అలైవ్' ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ లోనీ సింగరేణి ఏరియా హాస్పిటల్ లో పోలీసుల ఆధ్వర్యంలో సంబంధిత ప్రోగ్రాం నిర్వహించారు.ఆ సందర్భంగా  పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జే.శ్రీధర్ ఆసుపత్రిలోని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.అయితే మోటార్ సైకిల్ పై తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,ఫోర్ వీలర్ దారులు సీటు బెల్టు తప్పకుండా పెట్టుకోవాలని గుర్తు చేశారు.అలాగే వాహనంకు సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని సిబ్బందికి ఉండాల్సిన బాధ్యతలు,క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.దాంట్లో ముఖ్య అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.చిన్నపిల్లలకు టూవీలర్-ఫోర్ వీలర్ ఇవ్వకూడదని,అతివేగంగా ఆజాగ్రత్తగా నడపకుండా చూడాలని వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే ప్ర...

లోక్ సభ,అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు?

Image
లోక్ సభ,అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు? జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... హైదరాబాద్ న్యూస్,మార్చి-24,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: భారతదేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీసే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.ఆ క్రమంలో చూస్తే..లోక్‌సభ,రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను 50% శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది.ఇందుకు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశ పెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది.దీని ప్రకారం..ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలు 816కి పెరగనున్నాయి.ఇదే విధంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు కూడా 4,123 నుంచి 6,185కు పెరుగుతాయి.ఈ ప్రతిపాదనలో భాగంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ లలో లోక్‌సభ,అసెంబ్లీ స్థానాలు గణనీయంగా పెరగనున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు..అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరగనున్నాయి.అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి..అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు చేరే అవకాశం ఉంటుంది.ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సోమవారం సాయంత్రం ఎన్డీయే సమా వేశంలో కేంద్ర ప్రభుత్వం వామపక...

బొక్కలగుట్ట రోడ్డుపై ప్రమాదం-దంపతులకు తీవ్ర గాయాలు?ఫ్లాష్ న్యూస్..

Image
బొక్కలగుట్ట రోడ్డుపై ప్రమాదం-దంపతులకు తీవ్ర గాయాలు? -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్.... రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-24,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు కాబడిన దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి.జిల్లాలోని మందమర్రికి చెందిన సింగరేణి కార్మికుడు వెంకటస్వామి కేకే5 గనిలో ట్రామార్ గా ఉద్యోగం చేస్తున్నాడు.ఆయన భార్య పేరు సుమలత ఆ ఇద్దరు తీవ్రంగా రోడ్డు యాక్సిడెంట్లో గాయపడ్డారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల నుంచి ద్విచక్ర వాహనంపై మందమర్రి వైపు వస్తున్న సమయంలో బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయం సమీపంలోని వంతెనపై వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టినట్టు తెలుస్తుంది.ఆ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆ ఇద్దరు దంపతులను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త మృతి చెందడంతో పాటు భార్య సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం...

రంజాన్ పండుగతో ముస్లింలకు శుభాకాంక్షలు-మంత్రి వివేక్

Image
రంజాన్ పండుగతో ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వివేక్ వెంకటస్వామి జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్..... రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-21,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: రంజాన్ పండుగ  పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం సోదరి,సోదరులకు శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.ఆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ పండుగ శాంతి,సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని అందరి జీవితాల్లో ఆనందం,ఐశ్వర్యం నింపాలని,సమాజంలో ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు.ఆ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గోపతి రాజయ్య,ప్రభాకర్,మల్లేష్,రమేష్,అబ్దుల్ అజీజ్,అక్బర్ అలీ,పల్లె రాజు,గాండ్ల సమ్మయ్య,పట్టణ ముస్లిం నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.