Posts

Showing posts from April, 2025

క్యాతనపల్లిలో డబుల్ బెడ్ రూంలు లక్కీ డ్రా తో ఇవ్వడానికి సిద్ధం

Image
క్యాతనపల్లిలో డబుల్ బెడ్ రూంలు లక్కీ డ్రా తో ఇవ్వడానికి సిద్ధం  -- మున్సిపాలిటీ కమిషనర్ రాజు ప్రకటన -- జర్నలిస్టు డైలీ పేపర్ అండ్ టీవీ న్యూస్....  రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్-30 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు కోసం ధరఖాస్తు చేసుకున్న విషయంలో లక్కీ డ్రా ద్వారానే ఆ కేటాయింపు జరుగుతుందని బుధవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి.రాజు తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాలు ప్రకారం మందమర్రి తహసిల్దార్ కార్యాలయం రెవెన్యూ సిబ్బంది ద్వారా సంబంధిత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపునకు దరఖాస్తు చేసుకున్న వారి యొక్క దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేసినట్లు తెలిపారు.అయితే సిద్దంగా ఉన్న 236 ఇండ్లకు మాత్రమే ప్రస్తుతము “లక్కీ డ్రా” ద్వారా ఎంపిక చేయబడుతుందని 285 అర్హుల యొక్క జాబితాను పురపాలక సంఘ కార్యాలయం క్యాతనపల్లి నోటీసు బోర్డుపై ప్రచురించినట్లు ప్రకటించారు.ఆ జాబితాలో దరఖాస్తుదారుల నుంచి అభ్యంతరాలు స్వీకరించుటకు పురపాలక సంఘ కార్యాలయం క్యాతనపల్లిలో “హ...

ఆర్కేపి ఏరియా ఆస్పత్రిలో సిఎంఓ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ కు ఘనంగా సత్కారం

Image
ఆర్కేపి ఏరియా ఆస్పత్రిలో సిఎంఓ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ కు ఘనంగా సత్కారం  ---   డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వందనం చేసిన సిఎంఓ.. రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్-28 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ : సింగరేణి కాలరీస్ లోని కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రి సిఎంఓగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఆర్. కిరణ్ రాజ్ కుమార్ కు రామకృష్ణాపూర్ లోని ఏరియా ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు.ఆ క్రమంలో చూస్తే.. బాధ్యతలు స్వీకరించిన సీఎంఓ రాజకుమార్ ముఖ్య వైద్యాధికారి బెల్లంపల్లి రీజియన్ లోని అన్ని ఆసుపత్రిలలో పర్యటించారు. దాంట్లో భాగంగానే రామకృష్ణాపూర్ లోని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఈరోజు సాయంత్రం పర్యటించారు.దాంతో సీఎం ఓ డాక్టర్ రాజకుమార్ కు ఏరియా ఆసుపత్రి ఉద్యోగ సిబ్బంది గౌరవంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన కాన్ఫరెన్స్ హాల్లోని ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్లు,ఆసుపత్రి ఉద్యోగ సిబ్బంది శాలువాలు కప్పి పుష్పగుచ్చం సమర్పించి ఆయనకు గౌరవంగా ఉద్యోగ సిబ్బంది సత్కరించారు.ఈ సందర్భంగా సిఏంఓ మాట్లాడుతూ... సింగరేణి వ్యాప్తంగా ఆసుపత్రులను అభివృ...

భీమా గార్డెన్స్ లో చెన్నూరు ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

Image
భీమా గార్డెన్స్ లో చెన్నూరు ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం  --  ముఖ్యఅతిథి చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్  --  డిసిసి అధ్యక్షురాలు సురేఖ,టీపీసీసీ పరిశీలకులు రాఘవరెడ్డి,రాంభూపాల్ ప్రసంగం... --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్-28 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలో గల రామకృష్ణపూర్ లోని భీమా గార్డెన్స్‌లో సోమవారం కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే డా.వివేక్ వెంకటస్వామి,టీపీసీసీ పరిశీలకులు జంగ రాఘవ రెడ్డి,రాం భూపాల్,డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు హాజరైనారు.ఆ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వేదికపై ప్రసంగించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.900 కోట్ల సిఎం రిలీఫ్ ఫండ్ నిధులను ప్రజలకు అందించామన్నారు.చెన్నూరు నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందించడం.ఆయన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.సింగరేణి సంస్థలో గతంలో లక్ష ఉద్యోగులు ఉండగా కేసీఆర్ హయాంలో 60 వేల ఉద్యోగాలు తగ్గిపో...

ఆర్కేపిలో ర్రాత్రంతా కరెంటు లేక వర్ణించలేని బాధలు?

Image
ఆర్కేపిలో ర్రాత్రంతా కరెంటు లేక వర్ణించలేని బాధలు? ---   ఉక్కపోత దోమలతో ప్రజలు పరేషాన్ -తీవ్ర ఆగ్రహం ---   జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్.. రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్-27 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్-క్యాతనపల్లి పట్టణంలో శనివారం రాత్రి విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు చాలా రకాలుగా వర్ణించలేని ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆ క్రమంలో చూస్తే..అసలే 45 డిగ్రీల ఉష్ణోగ్రత ముదిరిన ఎండలు కావడం దానికి తోడు రాత్రివేళ సమయంలో ఈదురు గాలులతో కూడిన చిన్నపాటి వర్షం కురిసింది.ఆ సమయంలో గాలులు ఎక్కువగా వీచడంతో ముందుగానే సంబంధిత విద్యుత్ ఉద్యోగులు విద్యుత్తు సరఫరాను సైతం ప్రతి ఇంటిలోకి ఇన్కమింగ్ ఆఫ్ చేయడం జరిగింది.అంతేకాకుండా రాత్రివేళ సమయంలో 12 గంటల నుంచి తెల్లవారుజామున వరకు కూడా విద్యుత్ సరఫరాను ఇవ్వలేదు.దానికి గల కారణాలు చూస్తే..పట్టణంలోని యూనియన్ బ్యాంకు ముందు గల సింగరేణి విద్యుత్ స్తంభం కూలీ గవర్నమెంట్ విద్యుత్ తీగలపై పడింది.అంతేకాకుండా అటు పక్కనే గల డిస్పెన్సరీ ముందు గల ఒక చెట్టు కూలి విద్యుత్తు తీ...

ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం

Image
ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం --   జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్... పెద్దపల్లి న్యూస్ ఏప్రిల్-27 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : పేద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తీరు ఇతర అధికారులకు ఆదర్శంగా నిలిచింది. ఆ క్రమంలో చూస్తే... కలెక్టర్ భార్య విజయ గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ప్రసవించారు.అయితే రాత్రి పురిటినొప్పులు రావడంతో వైద్యులు ఆపరేషన్ చేయగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.ప్రధానంగా కలెక్టర్ భార్య గర్భం దాల్చినప్పటి నుంచి కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేయించారు.దాంతో కలెక్టర్ దంపతులపై ప్రశంసలు కురుస్తున్నాయి.

భారత్ పాకిస్తాన్ పై యుద్ధం మొదలుపెట్టిందా?

Image
 భారత్ పాకిస్తాన్ పై యుద్ధం మొదలుపెట్టిందా? --   సింధు నదిలో భారతీయుల రక్తం పారుతుంది... --   పాకిస్తాన్ బరితెగింపు మాటలు --   జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్... హైదరాబాద్ న్యూస్ ఏప్రిల్ 26 జర్నలిస్టు తెలుగు దినపత్రిక :పేహల్గాం ఉగ్రవాదులదాడితో భారత్ -పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి.ఆ క్రమంలో చూస్తే...ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి.సింధూ జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరాదని భారత ప్రభుత్వం నిర్ణయించింది.మరోవైపు పాకిస్థాన్ సైతం భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.ఉగ్రదాడితో ఆగ్రహంతో ఉన్న భారత్ ను రెచ్చగొట్టేలా పాక్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో ఇరు దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం మొదలయ్యే పరిస్థితి ఉందన్న వాదన వినిపిస్తోంది.అయితే గతంలో భారత్ -పాకిస్థాన్ దేశాల మధ్య ఎన్నిసార్లు యుద్ధాలు జరిగాయన్న విషయాలను ఓక సారి మంచిగా పరిశీలిద్దాం... 1947లో బ్రిటిష్ వారు భారతదేశ విభజన చేసినప్పటి నుంచి భారతదేశం,పాకిస్థాన్ మధ్య విభేదాలు ఉన్నాయి.గతంలో ఏకీకృత పెద్ద భార...

క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

Image
క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక --  జర్నలిస్టులు ఐక్యతతో ముందుకు సాగాలి... --  అధ్యక్షులు అరందస్వామి,గౌరవ ముఖ్య సలహాదారుడు కలువల శ్రీనివాస్ ప్రసంగం... రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్-22 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీనీ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆరంధ స్వామి,ప్రధాన కార్యదర్శి ఈదునూరి సారంగారావు,కోశాధికారి బండ అమర్నాథ్ రెడ్డి,గౌరవ ముఖ్య సలహాదారుడు కలువల శ్రీనివాస్,గౌరవ అధ్యక్షులుగా పిలుమల్ల గట్టయ్య,ప్రచార కార్యదర్శి అరెల్లి గోపికృష్ణ,కార్యనిర్వాహణ అధ్యక్షుడు గంగారపు గౌతమ్ కుమార్,ఉపాధ్యక్షులు మారపల్లి వేణుగోపాల్ రెడ్డి,కొండ శ్రీనివాస్,నాంపల్లి గట్టయ్య,కార్యనిర్వహక కార్యదర్శి పొనగంటి దుర్గా రాజేంద్రప్రసాద్,సహాయ కార్యదర్శులు నెల్లూరి శ్రీనాథ్,పురుషోత్తం గంగులు యాదవ్ లను ఎన్నుకున్నారు.అలాగే ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులుగా దాసరి స్వామి,కొమ్మ సదానందం,దుర్గం వెంకటస్వామి,మాషపత్రి ప్రవీణ్,మోరే రవీందర్ లు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా గౌరవ ముఖ్య సలహాదారుడు కలు...

ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలు అలరించాయి

Image
ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలు అలరించాయి  --  యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు- ముందు మరియాకు దర్శనమిచ్చాడు  --  క్రీస్తు ప్రభువు మహిళలకు విలువ గౌరవంతో గుర్తించాడు  --  ముగ్గురు స్త్రీలు ముందుగా యేసు శిష్యులకు యేసు లేచినట్లు వర్తమానం అందించారు  --  యేసు తిరిగి లేచాడు ప్రజల కోసమే దేవుడు ఉన్నాడు  --  దైవజనులు-పాస్టర్ ఎం.జాషువా సందేశం - ప్రసంగం.... రామకృష్ణాపూర్ న్యూస్,ఏప్రిల్-20,జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ :  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా -సెయింట్ పీటర్స్ చర్చి దైవజనులు- ప్రెస్ బీటర్ ఇన్చార్జ్ రేవరెండ్ ఎం.జాషువా ఆధ్వర్యంలో ఆదివారం ఈస్టర్ పండుగ ఆరాధన వేడుకలు అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో మంచిగా విశ్వాసం పూర్తిగా నమ్మకంతో ఘనంగా నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు చర్చి దేవాలయానికి చేరుకున్న క్రైస్తవులు మహిళలు క్రైస్తవ కుటుంబాలు ముందుగా యేసు శిలువపై మహిళలు క్యాండిల్స్ వెలిగించి పాటలు పాడుతూ ప్రార్థనలు చేశారు.అనంతరం దేవాలయంలో జరిగిన...

పెద్దపల్లి ఎంపి కృషి ఫలితంగానే 140 కోట్ల పెన్షన్ ఫండ్

Image
పెద్దపల్లి ఎంపి కృషి ఫలితంగానే 140 కోట్ల పెన్షన్ ఫండ్ రామకృష్ణాపూర్ న్యూస్ ఏప్రిల్-19 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్ : సింగరేణి కార్మికులు పెన్షన్ పథకం గత మూడు దశాబ్దాలుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.దాంతో కార్మికుల భవిష్యత్ పై గత35 సంవత్సరాలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాలక వ్యవస్థలకు వ్యతిరేకంగా పార్లమెంటులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పలుసార్లు మాట్లాడారు.ఆయన కృషి ఫలితంగా సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రతి టన్నుపై 20 రూపాయల పెన్షన్ ఫండ్ కు కేటాయించేందుకు అంగీకరించింది దాని ద్వారా 140 కోట్లు రూపాయల భారీ నిధి పెన్షన్ ఫండ్ కు చేరుతుంది.ఆ పథకం అమలు కావడానికి కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ చిత్రపటానికి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ ఐఎన్టియుసి ఆఫీసు వద్ద శనివారం రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.ఆ నేపథ్యంలోనే పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.ఆ కార్యక్రమంలో రిటైడ్ కార్మికులు చంద్రగిరి ఎల్లయ్య,ఎల్లవేని గంగయ్య,మెట్ట సుధాకర్అడల రాజయ్య,జక్కుల రాజయ్య,అప్పని రామయ్య...