Posts

Showing posts from June, 2025

ఆర్కేపి మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య ఎంపిక

Image
రామకృష్ణాపూర్ మున్నూరు సంఘం అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య -- మున్నూరు సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రసంగం  -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-29,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణ మున్నూరు కాపు సంఘం సమావేశం ఆదివారం నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..మున్నూరు కాపు సంఘం ఆర్ కే పి నూతన కమిటీని ఎన్నుకోన్నారు. ఆ సంఘం నూతన అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్యను ఎన్నుకున్నారు.అలాగే ప్రధాన కార్యదర్శిగా అలుగుల సత్తయ్య,గౌరవ అధ్యక్షులు రామిడి కుమార్,ముఖ్య సలహాదారుడు పల్లె రాజు,సలహాదారులుగా 1)కోల శ్రీనివాస్,2)దామర కొండ భీమయ్య,ఉపాధ్యక్షులుగా 1)ఆత్మకూరు మహేందర్,2)మెట్ట సుధాకర్,3)పానుగంటి సత్తయ్య,4)ఆశణవేని సత్యనారాయణ,కోశాధికారిగా మేకల సురేందర్,కార్యదర్శులుగా 1)ఉప్పరి చంద్రమౌళి,2)పెరుక క్రాంతి, 3)వీరమల్ల రాజయ్య,4) రెంటం రవి,సహాయ కార్యదర్శులుగా1)ఇందూరు నారాయణ, 2)శామంతుల రాజన్న,3) రామిడి రాజన్న,4)రాంశెట్టి లక్ష్మణ్, ప్రచార కార్యదర్శిగా నరేడ్ల వెంకన్న, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పడాల నరసయ్యలను ఎన్నుకున్నారు.ఆ సందర్భంగా నూత...

ఆర్కేసిఓఏ క్లబ్ లో మునీర్ మెమోరియల్ ఉచిత మెగా వైద్య శిబిరం సక్సెస్

Image
ఆర్కేసిఓఏ క్లబ్ లో మునీర్ మెమోరియల్ ఉచిత మెగా వైద్య శిబిరం సక్సెస్ -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక -టీవీ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-29,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని     రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఆర్కేసిఓఏ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు స్వర్గీయ మునీర్ మెమోరియల్ ఉచిత మెగా వైద్య శిబిరం సక్సెస్ పుల్ గా చేపట్టారు.ఆ క్రమంలో చూస్తే...క్యాతనపల్లి మున్సిపల్ రెండవ వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత వైద్య శిబిరానికి కరీంనగర్లోని రెనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,మంచిర్యాలలోని మెడి లైఫ్ సూపర్ స్పెషాలిటీ సహకారంతో వైద్య చికిత్సలు జరిపారు.ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఎస్సై రాజశేఖర్,అతిథులుగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి,సీనియర్ నాయకులు ఒడ్నాల శ్రీనివాస్, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షుడు రామ్ శెట్టి నరేందర్,సీనియర్ అడ్వకేట్ సందాని,గాండ్ల సమ్మయ్య,అబ్దుల్ అజీజ్,సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు ...

సింగరేణి జల,సోలార్,పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో వేగం పెంచాలి

Image
సింగరేణి జల,సోలార్,పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో వేగం పెంచాలి ఇంధన శాఖ అన్ని విభాగాల ప్రాజెక్టుల పర్యవేక్షణకు డ్యాష్ బోర్డు  సింగరేణి పై  సమీక్షలో  ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు ఆదేశం సింగరేణి ప్రతినిధి,జూన్-28, జర్నలిస్టు తెలుగు దినపత్రిక న్యూస్: సింగరేణి సంస్థ చేపట్టనున్న 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు, 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్లాంట్, 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ ఏర్పాట్ల సన్నాహాలను మరింత వేగవంతం చేయాలని, కాల పరిమితిని విధించుకొని సత్వరమే ప్రాజెక్టులను చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు.శనివారం మహాత్మా జ్యోతి రావ్ ఫూలే ప్రజా భవన్ లో  సింగరేణి కాలరీస్ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా చేపట్టనున్న సోలార్ ప్లాంట్లు, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్, ఇతర పునరుత్పాదక విద్యుత్తు ప్లాంట్లపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి సంస్థ లోయర్ మానేరు డ్యాం రిజర్వాయర్ పై నిర్మించనున్న 300 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, మల్లన్న సాగర్ పై నిర్మించతలపెట్టిన...

రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝాకు ఉత్కృష్ట సేవా పతకం

Image
రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝాకు ఉత్కృష్ట సేవా పతకం -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్... మంచిర్యాల న్యూస్,జూన్- 28,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం అందజేసే ఉత్కృష్ట సేవా పతకానికి రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝాఎంపికైనారు.ఆ క్రమంలో చూస్తే..2009 ఐపిఎస్ బ్యాచ్ కి చెందిన సీపీ వివిధ హోదాలలో సుదీర్ఘకాలం వృత్తిపరమైన నైపుణ్యంతో విధులు నిర్వర్తించినందుకు గాను ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికైనారు.ఆ నేపథ్యంలోనే రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝాకు అధికారులు,సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

జర్నలిస్టు యాంకర్ స్వేచ్ఛ ఇకలేదు

Image
 జర్నలిస్టు యాంకర్ స్వేచ్ఛ ఇకలేదు..!! -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్... జర్నలిజంలో ఎంతో మంచి యాంకర్ గా పేరు తెచ్చుకున్న స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం..తెలంగాణా ఉద్యమంలో పోరాడిన జర్నలిస్ట్ ఆమె.పీడిత జనం స్వేచ్ఛ కోసం తన అక్షరాయుధంతో యుద్ధం చేసిన ధీర వనిత.. ప్రముఖ ఛానెల్లో పని చేస్తున్నపుడు ఆ ఛానెల్ ని తెలంగాణలో నిలిపివేస్తే ఏకంగా అప్పటి సీఎం కేసీయార్ ఇంటి ముందు ధర్నా చేసిన గొప్ప జర్నలిస్ట్..కానీ ఒక నీచుడి వేధింపుల కారణంగా ఆమె ఆ ఛానెల్ లో మంచి పొజిషన్ ను కాస్తా వదులుకుని బయటకు రావాల్సి వచ్చింది.. జర్నలిజాన్ని ప్రాణంగా భావించే స్వేచ్ఛ..ఇక లేదంటే నమ్మలేకపోతున్నాను.ఇది నిజం కాదు అబద్ధం అయితే బావుండు అని కోరుకుంటున్నాను..స్వేచ్ఛకు జోహార్లు..!!

రాష్ట్రమంత్రి వివేక్ క్యాతనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధికి శ్రీకారం చుట్టాడు

Image
కార్మిక శాఖ మంత్రి వివేక్ శ్రద్ధతోనే క్యాతనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధికి శ్రీకారం  బిఆర్ఎస్ నాయకుల విమర్శలను తీవ్రంగా ఖండించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి పి.రఘునాథరెడ్డి,ఆర్కేపి పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు రామకృష్ణాపూర్ న్యూస్,జూన్ 27,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : క్యాతనపల్లి మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రెండు రోజుల క్రితం హాజరైన రాష్ట్ర కార్మిక,గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మీద ఆరోపణలు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు గత అసమర్థ ఎమ్మెల్యే నుంచి ఏం పనులు చేయించుకున్నారో తెలుపాలని పిసిసి జనరల్ సెక్రెటరీ పి.రఘునాథరెడ్డి,ఆర్కేపీ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు ప్రశ్నించారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో శుక్రవారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో మాట్లాడారు.వార్డులలో ఏ పని చేయించాలన్న ఎమ్మెల్యేకు విన్నవించడం గాని అడగటం గానీ చేయకుండా అభివృద్ధి పనులు అసలు ఎలా జరుగుతాయన్నారు.ఐదు సంవత్సరాల కాలంలో శంకుస్థాపనలతో పబ్బం గడిపిన బిఆర్ఎస్ నాయకులు,నిధులను విడుదల చేసి పనులు కంప్లీట్ చేయించ...

క్యాతనపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్

Image
క్యాతనపల్లి- రామకృష్ణాపూర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ --- ఓపెన్ జిమ్,క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి మెట్లు ప్రారంభించిన మంత్రి రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-25,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల 14వ వార్డులో 28 లక్షల రూపాయల నిధులతో చేపడుతున్న సిసి రోడ్,డ్రైనేజ్ పనులకు రాష్ట్ర కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు.అలాగే చిల్డ్రన్ ప్లే,ఓపెన్ జిమ్ లను మంత్రి పెద్ద ఎత్తున ప్రారంభించారు.ఆ నేపథ్యంలోనే క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద15 లక్షల రూపాయలతో నిధులతో నిర్మించిన మెట్లును కూడా మంత్రి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,టిపిసిసి ప్రధాన కార్యదర్శి పి.రఘునాథ్ రెడ్డి,మాజీ క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ జంగం కల,మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అబ్దుల్ అజీజ్,...

జర్నలిస్టు టీవీ వార్తకు స్పందన..క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జిపై స్పీడ్ బ్రేకర్లు వేశారు

Image
జర్నలిస్టు టీవీ వార్తకు స్పందన..క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జిపై స్పీడ్ బ్రేకర్లు వేశారు  జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్  రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-23,జర్నలిస్టు తెలుగు దినపత్రిక న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఆనుకొని ఉన్న రామకృష్ణాపూర్ పట్టణంలో గల క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై సోమవారం స్పీడ్ బ్రేకర్లు వేశారు.ఆ క్రమంలో చూస్తే..క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి ఇటీవల కాలంలోనే ప్రారంభించారు.ప్రధానంగా చూస్తే...క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ స్థలంలో రోడ్డు క్రాస్ ఎక్కువగా ఉండటంతో పాటు డౌన్ ఎక్కువగా ఉండటం చేత రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మంచిర్యాల కలెక్టర్తో పాటుగా ఆర్ అండ్ బి అధికారుల దృష్టికి జర్నలిస్టు టీవీ పత్రిక తీసుకువెళ్లడం జరిగింది.దాంతో వెంటనే స్పందించిన సంబంధిత అధికారులు వెంటనే క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి రోడ్డుకు ఇరువైపులా ప్రమాద హెచ్చరిక బోర్డులు అమర్చారు.ఆ తర్వాత మళ్లీ జర్నలిస్టు తెలుగు దినపత్రిక ఛానల్ తప్పకుండా రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు వేయాలి ఇంకా వెంటనే బ్రిడ్జిపై స్ట్రీట్ లైట్లు కూడా పెట్టాలని మరొకసారి వార్త...

గంజాయి,మత్తుపదార్థాల నియంత్రణపై అవగాహన చేపట్టిన ఆర్కేపి పోలీసులు

Image
గంజాయి,మత్తుపదార్థాల నియంత్రణపై అవగాహన చేపట్టిన ఆర్కేపి పోలీసులు - ఎస్ఐ జి.రాజశేఖర్ ప్రకటన రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-22,జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల కనకదుర్గ కాలనీ వద్ద(వారంతపు సంత)ఏరియాలో ఆదివారం గంజాయి మత్తు పదార్థం నియంత్రణపై పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఆ సందర్భంగా ఆర్కేపి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్ మాట్లాడుతూ..సే నో టు డ్రగ్స్ ఎస్ టు లైఫ్ అనే నినాదంతో గంజాయి-మత్తుపదార్థాల నియంత్రణ కోసం పట్టణ ప్రజలతో పెద్దఎత్తున అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు.అదేవిధంగా ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఆర్కేపీలో గంజాయి,మత్తుపదార్థాల నియంత్రణ కోసం అనేక విధాలుగా వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రజలను ముఖ్యంగా యువతను చైతన్యవoతులను చేయడంతోపాటు గంజాయి ఇతర మత్తుపదార్థాలకు అలవాటుపడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.అదేవిధంగా గంజాయి సేవించేవారు ఇంకా అమ్మే వ్యక్తుల మీద కూడా శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోని పోలీసు కేసులు నమోదు చేసి జైలుకు  పంపుతున్నట్లు ప్రకటించారు. ప్రధానంగా యువతకు ఎట్టిపరిస...

కార్మిక శాఖ మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు

Image
కార్మిక శాఖ మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు -  క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ కమిటీ ప్రకటన రామకృష్ణాపూర్ న్యూస్,జూన్- 22,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :ఇటీవల కాలంలో రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామిని క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు శనివారం హైదరాబాద్ లో గౌరవంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం-పూల బోకే సమర్పించి మర్యాదపూర్వకంగా కలిసి  శుభాకాంక్షలు తెలిపారు.ఆ సందర్భంగా క్యాతనపల్లి మున్సిపాలిటీలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ప్రజాప్రతినిధులకు వారధిగా ఉంటూ ఎన్నో సమస్యలను పరిష్కరించడంలో భాగస్వాములు అవుతున్నామని ప్రెస్ క్లబ్ సభ్యులు తెలిపారు.అలాగే పాత్రికేయుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.కార్మిక శాఖ మంత్రిని కలిసిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆరంద స్వామి,ప్రధాన కార్యదర్శి ఈదునూరి సారంగరావు,కోశాధికారి బండ అమర్నాథ్ రెడ్డి,ముఖ్య సలహాదారులు కలువల శ్రీనివాస్,గౌరవ అధ్యక్షులు పిలుమాళ్ళ గట్టయ్య,ఉపాధ్యక్షులు కొండ శ్రీనివాస్ రెడ్డి,నాంపల్లి గట్టయ్య, వర్కింగ్ ప్రెసిడెం...

జర్నలిస్టుల ఐక్యత కోసమే క్యాతనపల్లి ప్రెస్ క్లబ్

Image
జర్నలిస్టుల ఐక్యత కోసమే క్యాతనపల్లి ప్రెస్ క్లబ్  గౌరవ ముఖ్య సలహాదారుడు కలువల శ్రీనివాస్  రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-20,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉండటానికి 2019లో క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వపరంగా అధికారికంగా(259 ఆఫ్ 2019)రిజిస్ట్రేషన్ కూడా చేపించినట్లు క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ ముఖ్య సలహాదారుడు కలువల శ్రీనివాస్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ యొక్క కమిటీ సమావేశం గురువారం సెయింట్ జోసెఫ్స్ స్కూల్లో నిర్వహించారు.ఆ సందర్భంగా కలువల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరిని కూడా ఒకే మార్గంలో అందర్నీ ఐక్యంగా ఉంచాడానికి చాలా రిస్కు తీసుకొని అందర్నీ ఏకం చేయడానికి ప్రెస్ క్లబ్ స్థాపించి క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ కమిటీ ఏర్పాటుకు కృషి చేసినట్లు పేర్కొన్నారు.అయితే 30 ఏళ్ల ఆయన జర్నలిస్టు యొక్క సుదీర్ఘ సర్వీసులో ఇప్పటివరకు ఎన్నో నిజాలను వాస్తవాలను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాచారం అందిస్తున్నట్లు గుర్తు చేశారు.ప్రధానంగా క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ తో ఏలాంట...

అంతర్జాతీయ యోగా దినోత్సవంతో ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో యోగ

Image
అంతర్జాతీయ యోగా దినోత్సవంతో ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో యోగ  ఈ నెల 21న-11వ అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు  సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి 21 వరకు యోగ ప్రోగ్రాంలు జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-18,జర్నలిస్టు తెలుగు దినపత్రిక : సింగరేణి కాలరీస్లోని మందమర్రి డివిజన్ పరిధిలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో బుధవారం ఉదయం యోగ టీచర్ శైలజ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం అత్యంత శ్రద్ధతో చక్కగా నిర్వహించారు.సింగరేణి వ్యాప్తంగా చేపడుతున్న సంబంధిత కార్యక్రమాలలో భాగంగా 11వ అంతర్జాతీయ దినోత్సవ యొక్క వేడుకలు ఈనెల 21న నిర్వహిస్తారు.దాంతో ఈనెల 16 నుంచి 21 తేదీ వరకు ఈ యోగా వేడుకలు చేపడుతున్నారు.కాగా ఏరియా ఆసుపత్రిలో చేపట్టిన యోగాలో ఆస్పత్రి ఉద్యోగ సిబ్బంది అందరూ కూడా కలిసి యోగా విన్యాసాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి డివైసిఎమ్ఓ ప్రసన్నకుమార్,సంక్షేమ అధికారి,డాక్టర్లు,నర్సులు,వార్డు బాయిలు,ఉద్యోగ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.